YS Viveka Murder Case: వివేక హత్యతో సంబంధం లేదు.. రంగయ్య బెదిరించలేదన్న గంగిరెడ్డి

వైఎస్ వివేకానంద రెడ్డి (ఫైల్ ఫొటో)

వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయి.. మరి ఆ ముగ్గురి వెనుక ఉన్నది ఎవరు అన్నదానిపై సీబీఐ అధికారులు ఫోకస్ చేశారు.

 • Share this:
  Erra Gangi Reddy:మాజీ మంత్రి వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసు పలు మలుపు తిరుగుతోంది. 45 రోజుల విచారణలో ఇప్పటికే హత్యకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వాచ్ మె సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివేకాను హత్యచేసింది ఎర్ర గంగిరెడ్డి, సునీల్, దస్తగిరి అని వాచ్‌మెన్‌ రంగయ్య చెప్పడంతో మరోసారి ఈ వ్యహారం హాట్ టాపిక్ గా మారింది. అందరూ భావిస్తున్నట్టే ఈ హత్య కేసు వెనుక పెద్దల హస్తం ఉంటుందనే అనుమానాలు భయపడుతున్నాయి. ప్రస్తుతం ఆ తెరవెనుక పేర్లు ఎవరికి అన్నదానిపైనే సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. మరోవైపు వివేకా కేసులో రంగయ్య కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసింది. అయితే తనను చంపేస్తానని గంగిరెడ్డి బెదిరించడంతోనే ఇప్పటి వరకు అసలు నిజాలు చెప్పలేకపోయాను అన్నాడు ఆయన. అయినా సరైన భద్రత ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. వివేకాను చంపింది వీళ్లే అంటూ ముగ్గురి పేర్లు చెప్పడంతో.. రంగయ్య ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. కేసు విచారణకు సంబంధించి ఎవరితో మాట్లాడవద్దంటూ రంగయ్యకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

  రంగయ్య చెప్పిన అంశాలపై సీబీఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధం అవుతుండగా.. గంగిరెడ్డి, సునీల్, దస్తగిరి ప్రమేయంపై ఫోకస్ పెట్టారు పోలీసులు. వాచ్‌మెన్ రంగయ్య ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఆ ముగ్గురేనా…? వాచ్‌మెన్‌ రంగయ్య ఆరోపణల వెనకున్న వాస్తవమెంత..? వివేకాతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఎర్ర గంగిరెడ్డి ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది..? ఇదే విషయంపై ఇప్పుడు సీబీఐ అధికారులు దృష్టిపెట్టారు.

  రంగయ్య చెప్పిన ముగ్గురు వ్యక్తులు వైఎస్ వివేకాకు చాలా సన్నిహితులు.. మరి అలాంటి మాజీ డ్రైవర్‌ దస్తగిరి, మరో అనుచరుడు సునీల్ ఈ హత్యలో పాల్గొన్నారా? ఒకవేళ పాల్గొంటే వివేకాతో సన్నిహితంగా ఉండే అనుచరులు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న దానిపై సీబీఐ అధికారులు కూపీ లాగుతున్నారు. ఇదిలా ఉంటే రంగయ్య చేసిన వ్యాఖ్యలపై లేటెస్ట్‌గా ఎర్రగంగిరెడ్డి స్పందించారు. వివేకా హత్య కేసులో తన ప్రమేయం లేదని చెప్పారు. అసలు రంగయ్యతో తనకు పరిచయమే లేదన్నారు గంగిరెడ్డి. తాను ఎవరిని బెదిరించలేదంటూ చెప్పుకొచ్చారు.

  దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత తమ్ముడైన వైఎస్ వివేకానంద రెడ్డి గతంలో కడప ఎంపీగా, కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు అనగా మార్చి 15న ఆయన పులివెందులలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను దారుణంగా నరికి హతమార్చారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం అప్పట్లో సిట్ ద్వారా దర్యాప్తుకు ఆదేశించగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన దర్యాత సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది.
  Published by:Nagesh Paina
  First published: