టీడీపీ ఎమ్మెల్సీకి షాక్... వైఎస్ వివేకా హత్యకేసులో సిట్ నోటీస్...

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్సీ, పులివెందులకు చెందిన బీటెక్ రవిని సిట్ విచారణ జరపనుంది.

news18-telugu
Updated: December 7, 2019, 7:44 PM IST
టీడీపీ ఎమ్మెల్సీకి షాక్... వైఎస్ వివేకా హత్యకేసులో సిట్ నోటీస్...
వైఎస్ వివేకానంద రెడ్డి
  • Share this:
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్సీ, పులివెందులకు చెందిన బీటెక్ రవిని సిట్ విచారణ జరపనుంది. ఈనెల 5వ తేదీన విచారణకు రావాల్సిందిగా బీటెక్ రవికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి మరో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి డ్రైవర్ దస్తగిరిని సిట్ బృందం ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో పాటు ఆదినారాయణరెడ్డిని కూడా పోలీసులు విచారణ చేయనున్నట్టు తెలిసింది. ఈ కేసును మరో వారం రోజుల పాటు విచారణ జరపనున్నట్టు సమాచారం. ఈ ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. మాజీ సీఎం తమ్ముడు, ఓ రాజకీయ పార్టీ అధినేత అయిన జగన్ మోహన్ రెడ్డికి బాబాయి, స్వయానా మాజీ మంత్రి కూడా అయిన వైఎస్ వివేకా హత్య రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని సృష్టించింది. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు జగన్ కుటుంబం ప్రయత్నించిందని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ కేసు విచారణకు సిట్‌ను నియమించింది. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఆరు నెలలు గడిచినా కూడా ఇంకా బాబాయ్ హత్య కేసులో నిందితులను పట్టుకోలేకపోయారంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు బాగా పెరిగాయి. ఈ క్రమంలో సిట్ విచారణ వేగవంతం చేసినట్టు కనిపిస్తోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 4, 2019, 6:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading