YS Viveka: వైఎస్ వివేకానంద హత్య కేసులో త్వరలో అరెస్టులు.. కీలక వ్యక్తుల విచారణ ముమ్మరం

వైఎస్ వివేకానంద రెడ్డి (ఫైల్ ఫొటో)

YS Viveka: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో త్వరలోనే అరెస్టులు ఉంటాయా..? 30 రోజుల విచారణలో సీబీఐ అధికారులు తేల్చింది ఏంటి..? కీలక వ్యక్తులను పదే పదే విచారణ చేయడం వెనుక రహస్యమేంటి..? అసలు కేసును త్వరగా తేల్చేస్తారా..? లేక రాజకీయ కారణాలతో ఇలా కాలయాపన చేస్తున్నారా..?

  • Share this:
    తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు మిస్టరీ ఇంకా వీడడం లేదు. గతంలో కంటే సీబీఐ ఈ సారి దూకుడు పెంచి విచారణ చేస్తోంది. త్వరలోనే అరెస్టులు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గడిచిన 30 రోజులుగా కడప, పులివెందుల కేంద్రాలుగా సీబీఐ బృందం ముమ్మరంగా విచారణ చేస్తోంది. తాజాగా కీలక వ్యక్తల ను విచారిస్తున్నారు. వివేకా హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేశారని సిట్ అరెస్ట్ చేసిన ఎర్ర గంగిరెడ్డితో పాటు పాటు వివేకా పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇదయతుల్లా, డ్రైవర్‌ ప్రసాద్‌, వైసీపీ కార్యకర్త కిరణ్‌కుమార్‌ యాదవ్‌ను సీబీఐ అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఈ ఐదుగురిని పులివెందుల అతిథి గృహంలో విచారించిన అధికారులు ఇవాళ మరోసారి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహానికి వచ్చిన ఈ ఐదుగురిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరినీ పదే పదే ప్రశ్నిస్తుండడంతో సీబీఐ అధికారులు ఇప్పటికే దీనిపై ఒక స్పష్టతకు వచ్చారనే ప్రచారం జరుగుతుంది. ఈ వారంలోనే అరెస్టులు ఉండే అవకాశం ఉందంటున్నారు.

    మాజీ డ్రైవర్ దస్తగిరి, వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగి రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయ తుల్లాలను ఇప్పటికే పలుసార్లు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న సీబీఐ అధికారులు.. మళ్లీ వరుసగా రెండు రోజులు వారిని సుదీర్ఘంగా విచారిస్తుండడంపై పలు అనుమానలు నెలకొన్నాయి. వీరితో పాటు పులివెందులకి చెందిన కృష్ణయ్య యాదవ్ కుటుంబాన్ని మొత్తం సీబీఐ గత కొన్ని రోజులుగా పదే పదే విచారిస్తూ ఉండడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ కుటుంబ సభ్యులనే పదే పదే విచారించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు వివేకానంద రెడ్డి హత్య కేస్ లో కృష్ణయ్య యాదవ్ కుటుంబం పాత్ర ఏంటి? అసలు వివేకాకి, కృష్ణయ్య యాదవ్ కుటుంబానికి పరిచయం ఏంటి..? ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడాయి.

    ఇదీ చదవండి: ష‌ర్మిళ పార్టీకి వ్యూహాక‌ర్త ఎవరో తెలుసా ? త్వరలోనే క్యాడ‌ర్ కు ప‌రిచ‌యం? ఆమె నేపథ్యం ఇదే

    కృష్ణయ్య యాదవ్ కుటుంబాన్ని పలుమార్లు ప్రశ్నించినా ఎలాంటి ఆధారాలు లభించలేదని.. ఈ హత్యకేసులో వారి ప్రమేయం ఉంది అనడానికి ఎలాంటి ఆదారాలు లభించలేదని తెలుస్తోంది. అయితే ఇక్కడే కొందరు సీబీఐ తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసులు పక్కదాని పట్టించేందుకే ఇలా కొత్త వ్యక్తులను తెరపైకి తెస్తున్నారని.. ఈ కేసులో దోషులు ఎవరన్నది అందరికీ తెలిసిందే అంటున్నారు. కావాలనే విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నిజంగా కేసుపై చిత్త శుద్ధి ఉంటే ఇప్పటికే నిందితుల పేర్లు బయటకు వచ్చేవని అంటున్నారు. మరి 30 రోజుల విచారణ తరువాతైనా సీబీఐ నివేదిక సిద్ధం చేస్తుందా..? లేక ఎప్పటిలాగా కాలయాపణ చేస్తుందా అన్నది చూడాలి.

    ఇదీ చదవండి : ఏపీలో తొలి వ్యాక్సిన్ తయారీ యూనిట్.. ఎక్కడంటే..? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది
    Published by:Nagesh Paina
    First published: