పులివెందుల సీఐపై వివేకా కూతురు సంచలన వ్యాఖ్యలు

కేసు దర్యాప్తును ఎవరైనా తప్పుదోవా పట్టిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తంచేశారు. హత్య జరిగిన తర్వాత సీఐ శంకరయ్య వ్యవహరించిన తీరు అనుమానాలు కల్గిస్తుందన్నారు సునీత.

news18-telugu
Updated: March 25, 2019, 12:45 PM IST
పులివెందుల సీఐపై వివేకా కూతురు సంచలన వ్యాఖ్యలు
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి
  • Share this:
వైఎస్ వివేకా హత్య జరిగి పదిరోజులు గడుస్తున్న ఇంతవరకు ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు. పలువురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నా... హత్య ఎందుకు ఎవరు చేశారన్నదానిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్యానంతరం జరుగుతున్న పరిణామాలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు ఆయన కూతురు సునీతారెడ్డి. తన తండ్రిహత్య జరిగి రోజులు గడుస్తున్నా ఇంతవరకు కేసులో పురోగతి లేకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోందన్నారు. కేసు దర్యాప్తును ఎవరైనా తప్పుదోవా పట్టిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తంచేశారు. హత్య జరిగిన తర్వాత సీఐ శంకరయ్య వ్యవహరించిన తీరు అనుమానాలు కల్గిస్తుందన్నారు సునీత. హైదరాబాద్‌లో ఉన్న తమకే హత్య అని అనుమానం వస్తే పోలీసులు రాలేదా అని ప్రశ్నించారు.

పులివెందుల సీఐ నారాయణ సమక్షంలో తన తండ్రి మృతదేహానికి కట్లు కట్టి ఆసుపత్రికి ఎలా తరలించారని సునీత అనుమానాలు వ్యక్తంచేశారు. ఆ సమయంలో ఆయన ఎందుకు జోక్యం చేసుకోలేదు? పంచనామా జరగకుండా శవానికి కట్లు కట్టడం తప్పని ఆయనకు తెలియదా? అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. డెడ్ బాడీని తరలిస్తుంటే సీఐ ఎందుకు చూస్తుండిపోయారన్నారు. సునీతారెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. ఆ సమయంలో తన బంధుమిత్రులు అక్కడే ఉన్నా వారు షాక్ లో ఉండిపోయారన్నారు. కానీ, అన్నీ తెలిసిన సీఐ శంకరయ్య తన విధినిర్వహణలో ఎందుకలా ప్రవర్తించాడో అర్థం కావడం లేదన్నారు సునీత రెడ్డి. తన తండ్రి హత్యతో సీఐకి ప్రత్యక్ష సంబంధం ఉందా? అనే కోణంలో కూడా తమకు అనుమానాలు వస్తున్నాయన్నారు.

వివేకా హత్య కేసులో ఇప్పటికే పులివెందుల అర్బన్ సీఐ శంకరయ్యను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలంలో ఆధారాలు కాపాడటంలో నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ అర్బన్ సీఐ శంకరయ్యను సస్పెండ్ చేశారు. డీఐజీ నాగేంద్రకుమార్ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. వివేకా హత్య జరిగిన వెంటనే రక్తపు మరకల్ని కడిగేయడంలో కీలకమైన ఆధారాలు దొరికే అవకాశాలు తగ్గిపోయామని పోలీసు శాఖ భావిస్తోంది.

ఇవికూడా చదవండి:

చెన్నైలో దారుణం... స్కూల్‌ విద్యార్థులతో లేడీ టీచర్ శృంగారం...

96 ఏళ్ల తండ్రిని ఎలుకల మధ్య పడేసిన కూతురు... 74 ఏళ్ల కూతురికి జైలు...
First published: March 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading