వైఎస్ షర్మిల ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సినీ స్టార్ ప్రభాస్‌తో తనకు సంబంధం అంటగడుతూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గత వారం వైఎస్ షర్మిల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను కలిసి ఫిర్యాదుచేయడం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేసేందుకు సైబర్ క్రైం పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా పోస్టింగ్‌లు చేసిన పలు వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు, ఫేస్బుక్ పేజీలను గుర్తించారు. షర్మిలకు ప్రభాస్‌తో సంబంధముందంటూ వీడియోలు తయారుచేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వారి ఐపీ అడ్రస్‌ల కోసం సైబర్ క్రైం పోలీసులు యూట్యూబ్ ప్రతినిధులను కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత సమాచారం సైబర్ క్రైం పోలీసులకు అందగా...మరికొంత సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
ఐపీ అడ్రస్‌ల ఆధారంగా ఇప్పటికే కొందరు నిందితులను సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఆరుగురిని అదుపులోకి తీసుకోగా...వీరిలో ఓ బీ.టెక్ చదవిని మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి వెనుక ఎవరనున్న అంశంపై ఆరా తీస్తున్నారు. పక్కా ఆధారాలతో అభియోగాలు నిర్థారణ అయ్యాక, పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశముంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.