హోమ్ /వార్తలు /క్రైమ్ /

YouTuber Madan: కోట్లలో సంపాదన.. చిక్కుల్లో యూట్యూబర్ మదన్ భార్య.. ఆ వీడియోలలో ఆమె వాయిస్ కూడా..

YouTuber Madan: కోట్లలో సంపాదన.. చిక్కుల్లో యూట్యూబర్ మదన్ భార్య.. ఆ వీడియోలలో ఆమె వాయిస్ కూడా..

భార్య కృతికతో యూట్యూబర్ మదన్

భార్య కృతికతో యూట్యూబర్ మదన్

యూట్యూబ్‌లో అశ్లీల పదజాలంతో కూడిన గేమ్ ట్రిక్స్ వీడియోలు చేసి.. కోట్ల రూపాయలు సంపాదించాడు మదన్. ఇందుకు సంబంధించి మదన్‌పై కేసు నమోదు కావడంతో అతడు పరారీలో ఉన్నాడు. దీంతో అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.

  అశ్లీల పదజాలంతో కోట్ల రూపాయలు సంపాదించాడు ఓ యూట్యూబర్. యువకులను టార్గెట్ చేసి భారీగా సబ్‌స్క్రైబర్స్‌ను పెంచుకున్నాడు. తొలుత గేమ్ ట్రిక్స్ చెప్పడానికి యూట్యూబ్ చానల్ ప్రారంభించినప్పటికీ.. ఆ తర్వాత దానిని అశ్లీల పదజాలంతో కూడిన వీడియోలు చేయడానికి ఉపయోగించాడు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఈ విషయాన్ని News18 Tamil Nadu జూన్ 10వ తేదీన వెలుగులోకి తీసుకోచ్చింది. గత కొద్ది రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మదన్ కుమార్ మణిక్కం అలియాస్ మదన్ ఓపీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఇతడు 2019లో Toxic Madan 18+ అనే యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించాడు. ఇందులో గేమింగ్ ట్రిక్స్‌కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసేవాడు. నిషేధిత పబ్జీ గేమ్‌ గురించి వీడియోలు చేశాడు. అయితే చానల్ పేరులోనే 18+ అని పేర్కొనడంతో.. అది ఒక రకంగా అడల్ట్ కంటెంట్ అని యూజర్లకు సంకేతమిచ్చినట్టయింది.

  దీంతో ఆ చానల్ పేరే చాలా మంది యూత్‌ను ఆకర్షించింది. దీంతో కొద్ది కాలంలోనే ఆ చానల్‌ సబ్‌స్క్రైబర్స్, వీక్షకుల సంఖ్య పెరిగింది. ఈ చానల్‌కు 8 లక్షలకు పైగా subscribers ఉన్నారు. అయితే మదన్.. తన YouTube channelలో పోస్ట్ చేస్తున్న వీడియోలలో అసభ్య పదజాలం, అశ్లీల భాష వాడుతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు రావడం మొదలైంది. అయితే మదన్ మాత్రం ఏ వీడియోలు కూడా తన ఫేస్ రివీల్ చేసేవాడు కాదు. భారతదేశంలో PUBGపై నిషేధం విధించినందుకు మదన్ కేంద్రాన్ని అశ్లీల పదజాలంతో దూషించాడు. దీంతో పోలీసులు యూట్యూబ్ చానల్ యజమాని మదన్‌పై చర్యలకు ఉపక్రమించారు.

  మదన్ తన వీడియోలలో ఎక్కువగా అశ్లీల పదాలను వాడి 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారిని ఆకర్షించేవాడు. అలాగే వారిని న్యూడ్ వీడియో చాట్ రావాల్సిందిగా కోరేవాడు. ఈ అశ్లీల పదజాలంతో కూడిన వీడియోలకు వీక్షకులు పెరగడంతో.. మదన్‌కు ఆదాయం భాగా పెరిగింది. అంతేకాకుండా 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న బాలురు, బాలికల వద్ద నుంచి డబ్బులు దోచుకున్నాడనే ఆరోపణలు కూడా మదన్‌పై ఉన్నాయి.

  ఇక, మదన్‌పై ఇప్పటివరకు 159 ఫిర్యాదు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. మదన్ జూన్ 14వ తేదీన చెన్నైలోని సైబర్ క్రైమ్ పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. అతడు ఆ పని చేయలేదని చెప్పారు. దీంతో పోలీసులు మదన్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే అతడు పరారీలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు మద్రాస్ హైకోర్టులో మదన్.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే కోర్టు జూన్ 17న ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.

  ఇక, మదన్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. సేలంలో మదన్ అత్తగారింటి వద్ద ఉన్న అతని భార్య కృతికను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కోసం ఆమెను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మదన్ తండ్రి, సోదరులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు మదన్‌పై ఫిర్యాదు చేసిన బాధితులను కూడా పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. పోలీసులు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. మదన్ అశ్లీల పదజాలంతో కూడిన గేమింగ్ వీడియోస్ ద్వారా అతను నెలకు రూ. 10లక్షలకు పైగా సంపాదించేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ డబ్బులతో మదన్ రూ. 2 కోట్లు విలువ చేసే రెండు లగ్జరీ కార్లను, చెన్నై పెరుగళథూరులో రెండు లగ్జరీ ఇళ్లను నిర్మించినట్టుగా పోలీసులు గుర్తించారు.

  అలాగే మదన్ యూట్యూబ్ వీడియోలలో అశ్లీల పదజాలం వాడే మహిళ వాయిస్ వెనక ఉన్నది అతని భార్య కృతిక అని పోలీసుల దర్యాప్తులో తేలింది. మదన్ చేసే నేరానికి ఆమె కూడా సహకరించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ కోసం పోలీసులు ఆమెను చెన్నై తీసుకొచ్చారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఆమెను జూన్ 30 వరకు జ్యూడీషియల్ కస్టడీలో ఉంచనున్నారు. ఇక, మదన్ వినియోగించిన ల్యాప్‌ట్యాప్, డెస్క్ టాప్, కృతిక నుంచి ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మదన్‌ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మదన్ యూట్యూబ్ చానల్‌ను నిలిపివేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు యూట్యూబ్‌కు లేఖ రాశారు. అలాగే శాశ్వతంగా మూసివేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Crime news, Tamil nadu, Youtube

  ఉత్తమ కథలు