హోమ్ /వార్తలు /క్రైమ్ /

Youtuber Dheena suicide: హైదరాబాద్​లో దారుణం.. వ్యూస్​ రావడం లేదని యూట్యూబర్​​ ఆత్మహత్య.. వివరాలివే..

Youtuber Dheena suicide: హైదరాబాద్​లో దారుణం.. వ్యూస్​ రావడం లేదని యూట్యూబర్​​ ఆత్మహత్య.. వివరాలివే..

ధీనా ( ఫైల్​ ఫొటో)

ధీనా ( ఫైల్​ ఫొటో)

హైదరాబాద్​లో దారుణం చోటుచేసుకుంది. యూ ట్యూబ్ (Youtube) ఛానల్ కు వ్యూస్ రావడం లేదంటూ గేమర్​ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  హైదరాబాద్ (Hyderabad)​లో దారుణం చోటుచేసుకుంది. యూ ట్యూబ్ (Youtube) ఛానల్ కు వ్యూస్ రావడం లేదంటూ ఓ ఇంజనీరింగ్​ విద్యార్థి బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ క్రాంతి నగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.  మృతుడి పేరు ధీనా (Dheena) అని పోలీసులు గుర్తించారు.

  ధీనా ( ఫైల్​ ఫొటో)

  యూట్యూబర్​ ధీనా (Youtuber Dheena)  ఐఐటీ గ్వాలియర్‌లో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు.  ధీనా లైవ్‌లో గేమ్స్‌ (live games) ఆడుతూ య్యూటూబ్‌లో వ్యూయర్స్‌ను పెంచుకున్నాడు. లైవ్‌లో గేమ్స్‌ ఆడటంలో యువకుడు దిట్ట. అతను యూట్యూబ్‌లో selflo గేమ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాడు.  అయితే గత కొద్దిరోజులుగా యూట్యూబ్‌లో వ్యూయర్స్‌ పెరగడం లేదంటూ అతను ఆందోళన చెందుతూ వస్తున్నాడు. కాగా, ఇదే పెద్ద కారణం కాకపోయినా అతను చిన్నతనం నుంచి మానసిక వ్యధతో బాధపడుతున్నట్లు తెలిసింది. చుట్టూ ఉన్న జనం చిన్నచూపు చూడటంతో ఏళ్లుగా బాధపడుతూనే ఉండేవాడు ధీనా. తన బాధను తగ్గించేదే తన యూట్యూబ్​ ఛానల్​. అయితే ఆశించినంత వ్యూస్​ కూడా రాకపోవడం ధీనాను ఇంకాస్త కుంగదీసింది.

  గేమ్‌ ఆడుతూ తన బాధను చెప్పుకున్న ధీనా ఎవరూ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ సూచించాడు.  తన యూట్యూబ్​ పేజీలో సూసైడ్​ లెటర్​ కూడా పోస్టు చేశాడు. అందులో తను చిన్నతనం నుంచి ఎదుర్కొన్న అవమానాలు, బాధలు రాసుకొచ్చాడు. చిన్నప్పుడే రేప్​కు గురైనట్లు లేఖలో తెలిపాడు. తనను ఎవరూ పట్టించుకునే వారు కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులు  కూడా అశ్రద్ధ చేశారని ప్రేమ పంచలేదని లేఖలో తెలిపాడు.  ఈ  క్రమంలో గురువారం కొద్దిసేపటి క్రితమే యూట్యూబ్‌ లైవ్‌లో గేమ్‌ ఆడిన ధీనా  భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

  అయితే ధీనా లేఖను గమనిస్తే.. అతను చిన్నతనం నుంచి మానసిక సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలిసింది. స్కూల్​, కాలేజీ, ఇల్లు ఏదీ తనకు సంతోషం ఇవ్వలేదని రాసుకొచ్చాడు. ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోరని అన్నాడు. ఇక కాలేజీలో తనను ఓ వస్తువుగా మాత్రమే చూశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఎవరూ పిలవరని, ఎప్పుడూ చివరగా చూస్తారని బాధపడ్డాడు.

  ‘‘చిన్ననాటి రోజుల్లో నా 'ఫ్రెండ్స్‌'తో ఆడుకోవడానికి నేను చాలా డబ్బు చెల్లించాల్సి వచ్చేది. నన్ను తీర్చిదిద్దాలని అందరూ అనుకున్నపుడు మంచి స్కోరు రానపుడు ఎందుకు బతికున్నావ్​ అని కూడా నన్ను తిట్టారు. నేను నా 2వ తరగతిలో నా అపార్ట్‌మెంట్ పైకప్పుపై నుంచి దూకి చనిపోవాలని కూడా నా డైరీలో రాశాను. అప్పుడు ఏం వచ్చింది? నా గురువు నుంచి తిట్లు మరియు నా తల్లిదండ్రుల నుంచి దెబ్బలు. ఆ తర్వాత ఏమీ మారలేదు, అదే పాత కథ..”అని రాశాడు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Hyderabad, Suicide, Youtube

  ఉత్తమ కథలు