‘యూట్యూబ్ చోరులు’... వీడియోలు చూసి బైక్‌లు కాజేస్తున్న కాలేజ్ స్టూడెంట్స్...

తాళాలు లేకుండా బైక్ ఎలా స్టార్ట్ చేయాలో యూట్యూబ్ వీడియోలు చూస్తూ మెలకువలు తెలుసుకున్న స్టూడెంట్స్... పక్కా ప్రణాళికతో చోరీలు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 12, 2019, 7:20 PM IST
‘యూట్యూబ్ చోరులు’... వీడియోలు చూసి బైక్‌లు కాజేస్తున్న కాలేజ్ స్టూడెంట్స్...
నమూనా చిత్రం (Photo: ReUters)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 12, 2019, 7:20 PM IST
టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఎంతగా అంటే ఏం కావాలన్నా... ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఏం చేయాలన్నా... యూట్యూబ్ వీడియోలు చేసి చేసేయొచ్చు. అలా బైక్‌లు ఎలా దొంగిలించాలా? అని యూట్యూబ్ వీడియోల ద్వారా పాఠాలు నేర్చుకుని చోరీలకు పాల్పడ్డారు ఇద్దరు కాలేజీ విద్యార్థులు. తాళాలు లేకుండా బైక్‌లు ఎలా స్టార్ట్ చేయాలో కిటుకులు నేర్చుకుని... బైక్‌లు దొంగిలిస్తున్నట్టు తేల్చారు ముంబై పోలీసులు. ముంబయిలో ఓ ప్రైవేటు కళాశాలలో చదువుకుంటున్న అవినాశ్, రూపేశ్ అనే ఇద్దరు విద్యార్థులు... జల్సాలకు బాగా అలవాటు పడ్డారు. 22 ఏళ్ల లోపు వయసున్న ఈ ఇద్దరు స్టూడెంట్స్... జల్సాలకు కావల్సిన డబ్బుల కోసం దొంగతనాలను ఎంచుకున్నారు.

దొరకకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నారు. యూట్యూబ్ వీడియోలు చూస్తూ... తాళాలు పోయినప్పుడు బైక్‌లు ఎలా తెరవాలో యూట్యూబ్ వీడియోలను చూసి తెలుసుకునేవారు. అందులో చెప్పినట్టుగా కిటుకులు తెలుసుకుని తాళాలు లేకుండా బైక్‌లు ఎలా తెరవాలో బాగా ప్రాక్టీస్ చేశారు. సీసీటీవీ కెమెరాలు లేని చోట, నిర్మానుష్య ప్రదేశాల్లో పార్క్ చేసిన బైక్‌లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలా ముంబయిలో చాలాచోట్ల ఒక్క ఏడాదిలోనే దాదాపు పది బైక్‌లను దొంగిలించారు ఈ స్నేహితులు. దొంగిలించిన తర్వాత వాటిని సెకండ్ హ్యాండ్‌కు అమ్మేసేవాళ్లు. డాక్యుమెంట్స్ అడిగితే... తర్వాత ఇస్తామని చెప్పి నమ్మబలికేవారు. ఇలా వీరి దగ్గరి నుంచి బైక్స్ కొన్నవారిలో ఒకతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటికి వచ్చింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు... ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజాన్ని ఒప్పుకున్నారు. వీరి దగ్గర నుంచి ఆరు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి..

స్వీట్లు, స్నాక్స్ ఇచ్చి 12 ఏళ్ల మైనర్‌పై 3 నెలలుగా అత్యాచారం... గర్ల్‌ఫ్రెండ్ అనుమానంతో...
‘ఐ లవ్ యూ’... భార్య వాట్సాప్‌కు మెసేజ్... భర్త ఆత్మహత్య...


ఓమైగాడ్... ఏడుపులు వినగానే కళ్లు తెరిచిన శవం... ఆ తర్వాత...


‘ఆమెగా మారిన అతను’... ఈ వ్యక్తి ఆడా? మగా? హైదరాబాద్ పోలీసులకు వింత 
Loading...
జైలుకెళ్లి తండ్రిని చూసి వస్తున్న యువతిపై గ్యాంగ్ రేప్... మూడు నెలల తర్వాత...
వీల్‌ఛైర్ వివాహం... ఆసుపత్రిలో ఒక్కటైన ప్రేమజంట...

First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...