• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • YOUTUBE ARTIST JEETU JOHN HAS BEEN ARRESTED BY POLICE FOR ALLEGEDLY MURDERING HIS WIFE SSR

Jeetu John: ఇతను యూట్యూబ్‌‌లో ఫేమస్.. వీళ్లిద్దరూ లవర్స్.. ఏమైందో తెలియదు కానీ..

కోమల్ అగర్వా్, జీతూజాన్

జితేంద్ర అలియాస్ జీతూ జాన్ యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యాడు. అతని వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేవి. అలా తనకంటూ సోషల్ మీడియాలో జీతూ జాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న జితేంద్ర.. కోమల్ అగర్వాల్ అనే యువతిని ఇష్టపడ్డాడు. ఆమె కూడా అతనిని ఇష్టపడటంతో ఇద్దరూ కొన్ని నెలల నుంచి ప్రేమించుకున్నారు.

  • Share this:
    ముంబై: యూట్యూబ్‌లో పాపులర్ అయిన జీతూ జాన్ అనే యూట్యూబర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యను చంపాడనే ఆరోపణల నేపథ్యంలో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీతూ జాన్ భార్య అనుమానాస్పద స్థితిలో సొంత ఇంట్లో విగత జీవిగా కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జితేంద్ర అలియాస్ జీతూ జాన్ యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యాడు. అతని వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేవి. అలా తనకంటూ సోషల్ మీడియాలో జీతూ జాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న జితేంద్ర.. కోమల్ అగర్వాల్ అనే యువతిని ఇష్టపడ్డాడు. ఆమె కూడా అతనిని ఇష్టపడటంతో ఇద్దరూ కొన్ని నెలల నుంచి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పారు. అయితే.. కోమల్ తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్లు ఆమె ప్రేమకు అభ్యంతరం తెలిపారు. జీతూతో పెళ్లి చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. దీంతో.. కోమల్ ఇంట్లో వాళ్లకు తెలియకుండా జితేంద్రతో కలిసి మార్చి 4న ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్ని రోజులు ఇద్దరూ ఎంతో ప్రేమగా, అన్యోన్యంగానే ఉన్నారు. అయితే.. కొన్ని రోజుల తర్వాత జితేంద్ర ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని.. తమ కూతురిని హింసించడం మొదలుపెట్టాడని కోమల్ తల్లి షీలా పాతక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఇంట్లో పని చేసే విషయంలో తన కూతురితో రోజూ గొడవ పడి జితేంద్ర తిట్టి, కొట్టి వేధించాడని ఆమె ఆరోపించింది. కోమల్‌కు పెళ్లయిన కొత్తలో తన మరో కూతురు ప్రియ వాళ్లింటికి వెళ్లేదని.. కానీ.. కోమల్‌ను హింసిస్తున్నట్టుగా తెలుస్తుందన్న ఉద్దేశంతో ఆమెను రావొద్దని కోమల్‌తో జితేంద్ర చెప్పించాడని ఫిర్యాదులో పేర్కొంది. తన సోదరి చనిపోవడం గురించి ప్రియ మాట్లాడుతూ.. జితేంద్ర చాలాసార్లు కోమల్‌ను హింసించాడని.. అయితే చంపేంత వరకూ వెళతాడని తాము ఊహించలేదని ఉద్వేగానికి లోనైంది. మే 27న కోమల్ సొంత ఇంట్లో ఉరేసుకుని చనిపోయి కనిపించింది.

    ఇది కూడా చదవండి: Psychiatrist: నువ్వేం డాక్టరమ్మవమ్మా.. పాడు బుద్ధి కాకపోతే.. సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తూ ఇదేం సైడ్ బిజినెస్..

    ఆమె తల్లిదండ్రులు జితేంద్రపై అనుమానం వ్యక్తం చేస్తూ.. తమ కూతురిని అతనే చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. కోమల్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో జితేంద్రను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో అసలు నిజాలు తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని ఇన్‌స్పెక్టర్ షమ్ షిండే తెలిపారు. జితేంద్రపై ఐపీసీ సెక్షన్స్ 304, 323, 306, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
    Published by:Sambasiva Reddy
    First published: