హోమ్ /వార్తలు /క్రైమ్ /

పార్క్‌లో టిక్ టాక్ జల్సాలో యువతీయువకులు.. ఇంతలో పోలీసులు ఎంట్రీ

పార్క్‌లో టిక్ టాక్ జల్సాలో యువతీయువకులు.. ఇంతలో పోలీసులు ఎంట్రీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సమాచారం అందుకున్న పోలీసులు పార్క్ వద్దకు వెళ్లి యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించారు.

టిక్ టాక్..! యువతకు పరిచయం అక్కర్లేని మొబైల్ అప్లికేషన్..! అంతలా జనాలకు దగ్గరైంది ఈ చైనీస్ అప్లికేషన్..! టిక్ టాక్‌ను కొందరు టైమ్ పాప్ కోసం యూజ్ చేస్తే.. ఇంకొందరు మాత్రం సీరియస్‌గా దానికే పరిమితమయ్యారు. నిత్యం వీడియోలు తీయడం.. వాటిని సృజనాత్మకంగా రూపొందించడం.. ఒక డ్యూటీలా చేస్తున్నారు. ఒక్కడ పడితే అక్కడ.. ఎలా పడితే అలా.. వీడియోలు తీస్తూ చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఓ పార్క్‌లో ఐదారు మంది యువతీ యువకులు టిక్ టాక్ వీడియోలు తీశారు. కరోనా సమయంలో ఆంక్షలున్నా.. వాటిని ఉల్లంఘించి టిక్ టాక్‌లో మునిగితేలారు. మాస్క్‌లు ధరించకుండా.. భౌతిక దూరం పాటించకుండా వీడియోలు రూపొందించారు. సమాచారం అందుకున్న పోలీసులు పార్క్ వద్దకు వెళ్లి యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించారు.

First published:

Tags: Crime news, Odisha, Tik tok, Tiktok

ఉత్తమ కథలు