• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • YOUTH WHO PUT OBSCENE POSTS AGAINST SACHIN TENDULKAR ARRESTED BY MUMBAI POLICE NK

సచిన్‌ టెండుల్కర్‌పై అసభ్యకర పోస్టులు... ఏపీ యువకుడు అరెస్టు

సచిన్‌ టెండుల్కర్‌పై అసభ్యకర పోస్టులు... ఏపీ యువకుడు అరెస్టు

సచిన్‌ టెండుల్కర్‌పై అసభ్యకర పోస్టులు... ఏపీ యువకుడు అరెస్టు

ఆన్‌లైన్‌లో కొంత మంది తప్పులు చేస్తూ... తాము ఎవరికీ దొరకం అనుకుంటారు. ఇంటర్నెట్ వాడే ఎవరి అడ్రెస్ అయినా పోలీసులు గుర్తించగలరని తెలుసుకోరు.

  • Share this:
    నేరాలు చేసేవాళ్లు రకరకాలు. ఆ కుర్రాడు సైబర్ నేరానికి పాల్పడ్డాడు. మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడు. తన పోస్టులను ఎవరూ పట్టించుకోరులే అనుకున్నాడు. ఎక్కడో ముంబైలో ఉన్న సచిన్ దీనిపై స్పందించడులే అనుకున్నాడు. క్రమంగా సచిన్ కుటుంబ సభ్యులపైనా అసభ్యకరంగా పోస్ట్ పెట్టాడు నిందితుడు నాగరాజు. దీనిపై సచిన్ ఫ్యామిలీ... ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అలర్టైన ముంబై పోలీసులు... ఆ పోస్టును చెక్ చేశారు. అది ఎక్కడ నుంచి, ఎవరు పెట్టారో ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP) అడ్రెస్ తెలుసుకున్నారు. తర్వాత ఆ ఇంటర్నెట్ సర్వీస్ అందిస్తున్న సంస్థకు కాల్ చేశారు. ఐపీ అడ్రెస్ నంబర్ చెప్పి... ఆ అడ్రెస్ వాడుతున్న వ్యక్తి వివరాలు కావాలన్నారు. రెండు నిమిషాల్లో పోలీసులకు నాగరాజు ప్రొఫైల్ వచ్చేసింది. అతని అడ్రెస్ తెలిసింది.

    ముంబై నుంచి ప్రత్యేక పోలీసుల టీమ్ బయలుదేరింది. ఆంధ్రప్రదేశ్... గుంటూరు జిల్లా... పిడుగురాళ్ల వెళ్లారు. తెల్లారి అప్పుడే నిద్రలేచిన నాగరాజు... "బయటకు వెళ్లామంటే కరోనా టెన్షన్. ఇంట్లోనే ఉందామంటే... ఏవేవో ఆలోచనలు... ఏంటో జీవితం" అనుకుంటున్న సమయంలో... యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నారు పోలీసులు. షాకైన నాగరాజుకు సచిన్ సిక్స్ కొట్టిన దృశ్యం కళ్లముందు కదలాడింది.

    సచిన్‌ టెండుల్కర్‌పై అసభ్యకర పోస్టులు... ఏపీ యువకుడు అరెస్టు


    నాగరాజు సెల్‌ఫోన్, అతని తండ్రి సెల్‌ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు ఆ రెండు మొబైళ్లనూ వాడి పోస్టులు పెట్టినట్లు తేల్చారు. పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి... ప్రొసీజర్ పూర్తి చేశారు. అక్కడి నుంచి ముంబై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఇలా ఎవరు అక్రమ పోస్టులు పెట్టినా... సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ చర్యలు తప్పవు. అందుకే... ఆధారాలు లేకుండా... సోషల్ మీడియాలో ఆవేశపడటం వల్ల అనర్థాలు తప్పవంటున్నారు పోలీసులు.
    Published by:Krishna Kumar N
    First published: