YOUTH WHO CONSUMED POISON ALLEGEDLY AFTER MURDERING A NURSING STUDENT AT HOSAKERE DIED ON FRIDAY SSR
Shocking: ఏడేళ్ల ప్రేమ... బ్రేకప్ చెప్పి అంబులెన్స్ డ్రైవర్‌కు దగ్గరైన యువతి.. చివరకు ఊహించని ఎండింగ్..
కవిత, శివమూర్తి (ఫైల్ ఫొటోలు)
కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి తనను కాదని వేరొకరిని ప్రేమిస్తుందనే కారణంగా ఓ యువకుడు తన ప్రియురాలిని హత్య చేశాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన కర్నాటకలో కలకలం రేపింది.
శివమొగ్గ: కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి తనను కాదని వేరొకరిని ప్రేమిస్తుందనే కారణంగా ఓ యువకుడు తన ప్రియురాలిని హత్య చేశాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన కర్నాటకలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోసనగరె తాలూకాలోని కగ్గళి గ్రామానికి చెందిన శివమూర్తి అనే 21 ఏళ్ల యువకుడు, నంజప్ప లైఫ్ కేర్ నర్సింగ్ కాలేజీలో చదువుతున్న కవిత(21) అనే యువతి మధ్య పరిచయం ఏర్పడింది. శివమూర్తి, కవిత మధ్య ఏడేళ్ల నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జంట మధ్య ఇటీవల విభేదాలొచ్చాయి. మనస్పర్థలు రావడంతో కవిత బ్రేకప్ చెప్పి ఇక తనను ఎప్పడూ కలవొద్దని, కాల్ చేయొద్దని శివమూర్తికి తేల్చి చెప్పింది. అప్పటి నుంచి శివమూర్తి అసహనంతో రగిలిపోతున్నాడు. అలా ఉన్న ఆ యువకుడికి తన ప్రేయసి గురించి మరో నిజం తెలిసింది.
భద్రావతికి చెందిన అంబులెన్స్ డ్రైవర్‌తో కవిత ప్రేమలోఉందని తెలిసి శివమూర్తి మరింత రగిలిపోయాడు. తనను కాదని వేరొకరిని ఇష్టపడటాన్ని సహించలేకపోయాడు. తనకు దూరమైన కవిత మరొకరికి దగ్గరవ్వడం శివమూర్తికి ఏమాత్రం నచ్చలేదు. ఆ అంబులెన్స్ డ్రైవర్‌తో ప్రేమ కట్టిపెట్టాలని కవితను హెచ్చరించాడు. అయితే.. శివమూర్తి హెచ్చరికను పట్టించుకోకుండా ఆ యువకుడితో కవిత చనువుగా ఉంది. ఈ పరిణామం శివమూర్తిని మరింత బాధించింది. అసహనంతో రగిలిపోయేలా చేసింది. గత బుధవారం సాయంత్రం.. ఒకసారి కలుద్దామని.. మాట్లాడాలని శివమూర్తి కవితకు ఫోన్ చేశాడు. కవిత అతను చెప్పిన చోటికి వెళ్లింది. ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు. ఆ మాటలు కాస్తా ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీశాయి. కోపం పట్టలేకపోయిన శివమూర్తి కవితను చంపేశాడు. ఆమెను చంపేసి.. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యకు యత్నించాడు.
కవిత స్పాట్లోనే చనిపోగా.. విషం తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న శివమూర్తిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివమూర్తి కూడా చనిపోయాడు. రిప్పన్ డౌన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదైంది. శివమూర్తి సూసైడ్ నోట్ రాసి చనిపోవడం గమనార్హం. కవితను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానని.. తన ప్రేమను కాదని మరొక యువకుడితో దగ్గరవ్వడాన్ని సహించలేకపోయానని ఆ సూసైడ్ నోట్లో శివమూర్తి రాశాడు. అయితే.. కవిత తండ్రి చెప్పిన మాటలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. బీకాం చదువుతున్న శివమూర్తి ప్రేమ పేరుతో తమ కూతురిని వేధించాడని.. ఆమె తిరస్కరించడంతో చంపేశాడని కవిత తండ్రి చెప్పారు. పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.