కిస్ ఇస్తే కొంపముంచాడు... ఆ యువతికి ఏం జరిగిందంటే...

Tamilnadu Crime News : తెలిసి, తెలిసి కొందరు అమ్మాయిలు... నయ వంచకుల ఉచ్చులో చిక్కుకుంటారు. తమిళనాడులో ఆ యువతికి ఎదురైన పరిస్థితి ఎవరికీ రాకూడనిది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 15, 2019, 11:36 AM IST
కిస్ ఇస్తే కొంపముంచాడు... ఆ యువతికి ఏం జరిగిందంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చెన్నైలో ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతోంది 18 ఏళ్ల రష్మి (పేరు మార్చాం). ఆమె ఉంటున్న ఏరియాలోనే ఉండే శ్రీనాథ్... ఆమెకు చిన్నప్పటి నుంచీ తెలుసు. కాస్త అల్లరి చిల్లరగా తిరుగుతున్నా... ఆమెతో మాత్రం మంచివాడిలా కటింగ్స్ ఇచ్చేవాడు. కొన్నాళ్లు ఫ్రెండులా నటించాడు. ఆ తర్వాత ఆమెకు 18 ఏళ్లు రాగానే... ప్రేమిస్తున్నానంటూ వెంటపడసాగాడు. అలాంటివేవీ తనకు సెట్ కావని మొహంమీదే చెప్పింది. వన్ బ్యాడ్ డే రోజున... ఆమెకు మాయమాటలు చెప్పి... మహాబలిపురంలో ఆమెతో ఓ సెల్ఫీ తీసుకున్నాడు. సెల్ఫీయే కదా అనుకుంది. కానీ... ఆ సెల్ఫీని ఇంటర్నెట్‌లో పెట్టి... ఇద్దరి మధ్యా ఎఫైర్ నడుస్తోందని అందరికీ చెబుతానని బ్లాక్ మెయిల్ చేశాడు. ఇద్దరికీ పెళ్లి తప్ప అన్నీ అయిపోయానని ప్రచారం చేస్తానని బెదిరించాడు. అలాంటివేవీ చెయ్యవద్దని బతిమలాడింది. ఓ కిస్ ఇస్తే, వదిలేస్తానన్నాడు. సెల్ఫీ ఫొటో కూడా డిలీట్ చేస్తానన్నాడు.

తన సెల్ఫీని సోషల్ మీడియాలో పెడితే... నలుగురూ తన గురించి నెగెటివ్‌గా మాట్లాడుకుంటారనీ, లేనిపోనివి ఊహించుకుంటారనీ రష్మీ భయపడింది. ఇంట్లో పేరెంట్స్‌కి తెలిస్తే, చంపేస్తారని టెన్షన్ పడింది. ఓ ముద్దు ఇస్తే... సెల్ఫీ ఫొటో డిలీట్ చేసేస్తాడనీ, దరిద్రం వదిలిపోతుందనీ అనుకుంది. డీల్‌కి ఓకే చెప్పింది. బుగ్గ మీద మాత్రమే కిస్ ఇస్తానని కండీషన్ పెట్టింది. ఓకే అన్నాడు. ఓ రహస్య ప్రదేశంలో ఇద్దరూ కలిశారు. అక్కడ అతనికి కిస్ ఇచ్చింది. ఆమె ఎదురుగానే ఆమెతో తీయించుకున్న సెల్ఫీ ఫొటో డిలీట్ చేశాడు. హమ్మయ్య అనుకున్న ఆమె... అక్కడి నుంచీ వేగంగా వెళ్లిపోయింది.

రెండ్రోజుల తర్వాత మళ్లీ కలిశాడు. తనతో గడపడానికి రమ్మన్నాడు. షాకైన రష్మీ... సీరియస్‌గా చూసింది. వెంటనే ఆమెకు రెండు ఫొటోలు చూపించాడు. మొదటిది ఆమెతో దిగిన సెల్ఫీ ఫొటో (డిలీట్ చేయడానికి ముందే వేరే చోట సేవ్ చేసి ఉంచుకున్నాడు), రెండో ఫొటో ఆమె కిస్ ఇచ్చిన ఫొటో. (కిస్ ఇస్తున్నప్పుడు తన స్నేహితుడితో సీక్రెట్‌గా ఆ ఫొటోను తీయించాడు. ఆ విషయం రష్మీకి తెలియదు). ఆ రెండు ఫొటోలూ చూడగానే షాకైన రష్మీ... వాణ్ని ఇలాగే వదిలేస్తే... ఇంకా రెచ్చిపోతున్నాడని లోలోన మదనపడింది. వాడు చెప్పినట్లల్లా వింటే ఎన్ని రకాలుగానైనా బ్లాక్ మెయిల్ చేస్తాడని అర్థం చేసుకుంది. విషయానికి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది.


విషయం తల్లిదండ్రులకు చెప్పింది రష్మీ. కూతురికి అండగా నిలిచిన ఆ తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు శ్రీనాథ్‌తో పాటూ అతనికి సహకరించిన అతని స్నేహితుణ్ని కూడా పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. వాళ్లకు దాదాపు ఐదు నుంచీ ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండి :

  

 
First published: April 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు