హోమ్ /వార్తలు /క్రైమ్ /

Newly Married: పెళ్లయిన మూడు నెలలకే భర్తను ఇలా చూపించాల్సి వస్తుందని ఆమె ఊహించలేకపోయింది.. ఏం జరిగిందంటే..

Newly Married: పెళ్లయిన మూడు నెలలకే భర్తను ఇలా చూపించాల్సి వస్తుందని ఆమె ఊహించలేకపోయింది.. ఏం జరిగిందంటే..

అనీష్, దీప్తి పెళ్లి ఫొటో, పక్కన అనీష్ ఫొటోతో దీనంగా దీప్తి మిశ్రా

అనీష్, దీప్తి పెళ్లి ఫొటో, పక్కన అనీష్ ఫొటోతో దీనంగా దీప్తి మిశ్రా

ఉత్తరప్రదేశ్ ఓ పరువు హత్య కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంగా ఓ యువకుడిని యువతి తరపు వారు పట్టపగలే అత్యంత దారుణంగా హత్య చేయించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనీష్ కుమార్ చౌదరి అనే యువకుడు, దీప్తి మిశ్రా అనే ఓ యువతి కొంత కాలంగా ప్రేమించుకున్నారు.

ఇంకా చదవండి ...

గోరఖ్‌పూర్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు తరహాలోనే ఉత్తరప్రదేశ్ ఓ పరువు హత్య కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంగా ఓ యువకుడిని యువతి తరపు వారు పట్టపగలే అత్యంత దారుణంగా హత్య చేయించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనీష్ కుమార్ చౌదరి అనే యువకుడు, దీప్తి మిశ్రా అనే ఓ యువతి కొంత కాలంగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పారు. అనీష్ కుటుంబం తొలుత అంగీకరించనప్పటికీ ఆ తర్వాత పెళ్లికి ఒప్పుకున్నారు. దీప్తి మిశ్రా కుటుంబం మాత్రం ఈ పెళ్లికి ససేమిరా అనడంతో అనీష్, దీప్తి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ పరిణామంతో దీప్తి మిశ్రా కుటుంబం అనీష్‌పై పగ పెంచుకుంది. తమ కూతురిని అనీష్ కిడ్నాప్ చేశాడని దీప్తి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. తాము ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నామని.. ఇద్దరం మేజర్లమని.. తాను అనీష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని దీప్తి, అనీష్ వీడియో విడుదల చేశారు. దీంతో.. పోలీసులు కూడా దీప్తి కుటుంబానికి నచ్చజెప్పి.. ఆ కేసును అంతటితో వదిలేశారు. పోలీసుల నుంచి కూడా తాము ఆశించిన విధంగా స్పందన రాకపోవడంతో దీప్తి, అనీష్ పెళ్లయిన మూడు నెలలు దీప్తి కుటుంబం సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత.. ఊహించని నిర్ణయం తీసుకుంది.

జులై 24న దీప్తి కుటుంబం అనీష్ హత్యకు ప్లాన్ చేసింది. అనుకున్నట్టుగానే అనీష్‌ను నడి రోడ్డుపై పట్టపగలు అత్యంత దారుణంగా హతమార్చారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 17 మందిపై హత్య కేసు నమోదు చేశారు. ఇప్పటికే వీరిలో ఎనిమిది మందిని జైలుకు పంపారు. మిగిలిన వారిని విచారిస్తున్నారు. అనీష్, దీప్తి మిశ్రా మూడేళ్ల ప్రేమకథకు పెద్దలు ఇలా ముగింపు పలికారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దీప్తి మిశ్రా వేరే సామాజిక వర్గానికి చెందిన అనీష్‌ను పెళ్లి చేసుకోవడంతో సమాజంలో తమ పరువు పోయిందని భావించిన దీప్తి మిశ్రా కుటుంబం ఈ దారుణానికి ఒడిగట్టింది. అనీష్, దీప్తి గోరఖ్‌పూర్‌లోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు.

ఇది కూడా చదవండి: Bidyabharti: ఈమెకు గతేడాది డిసెంబర్‌లో పెళ్లైంది.. భర్తకు బంగారం లాంటి ఉద్యోగం.. జూలై 12న ఏం జరిగిందంటే..

దీప్తి సోషియాలజీలో ఎంఏ చేయగా.. అనీష్ యాన్సియంట్ హిస్టరీలో ఎంఏ చేశాడు. అనీష్, దీప్తి ఇద్దరూ గ్రామ పంచాయతీ అధికారులుగా ఉద్యోగాలు సాధించారు. ఇద్దరికి కౌదిరమ్ బ్లాక్‌లో పోస్టింగ్ ఇచ్చారు. మూడేళ్ల పాటు అక్కడ పనిచేస్తున్న సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. పెళ్లి చేసుకుంటే చివరికిలా జరిగింది. తన కుటుంబమే అనీష్‌ను హత్య చేయించిందని దీప్తి చెప్పింది. అనీష్‌ను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని.. ఇప్పుడు తనకు ఏం చేయాలో తెలియడం లేదని దీప్తి కన్నీరుమున్నీరయింది. నిందితులను తనకు అప్పగించాలని, తన చేతులతోనే వాళ్లకు శిక్ష విధిస్తానని దీప్తి భావోద్వేగానికి లోనైంది.

First published:

Tags: Honor Killing, Love marriage, Lovers, Married women, Murder, Uttarpradesh

ఉత్తమ కథలు