పంజాబ్‌లో దారుణం.. మైనర్ బాలికను లేపుకుపోయాడని..

మైనర్ బాలిక కుటుంబం తన కూతురు తప్పిపోయిందంటూ జూన్ 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల కంటే ముందుగానే మైనర్ బాలిక కుటుంబ సభ్యులు వీరిని గుర్తించారు.

news18-telugu
Updated: July 18, 2020, 12:55 PM IST
పంజాబ్‌లో దారుణం.. మైనర్ బాలికను లేపుకుపోయాడని..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పంజాబ్‌లో దారుణం జరిగింది. మైనర్ బాలికను లేపుకుపోయిన యువకుడి పట్ల మైనర్ బాలిక కుటుంబ సభ్యులు అమానుషంగా ప్రవర్తించారు. సదరు యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి.. మొహానికి నల్లరంగు పులిమారు. అంతటితో ఆగకుండా మెడకు బూట్ల దండను తగిలించారు. అనంతరం ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని లూధియానా కూమ్ కలాన్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అదే ప్రాంతంలో నివసిస్తున్న మైనర్ బాలికను ప్రేమించాడు. ఇటీవల వారిద్దరూ ఇంటిలో నుంచి పారిపోయారు. దీంతో మైనర్ బాలిక కుటుంబం తన కూతురు తప్పిపోయిందంటూ జూన్ 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల కంటే ముందుగానే మైనర్ బాలిక కుటుంబ సభ్యులు వీరిని గుర్తించారు. గురువారం ఉదయం గ్రామానికి తీసుకొచ్చి యువకుడిని చెట్టుకు కట్టేశారు. మూఖానికి నల్లరంగు పూసి అతడి మెడలో చెప్పుల దండను వేశారు.

గ్రామానికి చెందిన యువకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని యువకుడిని అరెస్టు చేశారు. అయితే ఇలాంటి ఘటన ఒకటి.. మే నెలలో ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కంగాంజ్ జిల్లాలో ఓ వ్యక్తి(65) పొరుగింటి మహిళను వేధింపులకు గురి చేశాడని.. గ్రామస్తులు అతడి మొహానికి నల్లరంగు పులిమి.. చెప్పుల దండను మెడలో వేసి గ్రామంలో ఊరేగింపుగా తిప్పారు.
Published by: Narsimha Badhini
First published: July 18, 2020, 12:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading