హైదరాబాద్‌లో దారుణం.. ప్రియురాలిని కొట్టి.. భవనంపై నుంచి తోసేసి..

మధ్యప్రదేశ్‌కు చెందిన వచ్చిన ఓ జంట 15 రోజుల క్రితం వనస్థలిపురంలోని శక్తినగర్‌లో అద్దెకు దిగారు.

news18-telugu
Updated: October 17, 2019, 8:16 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. ప్రియురాలిని కొట్టి.. భవనంపై నుంచి తోసేసి..
ప్రేమ జంట
news18-telugu
Updated: October 17, 2019, 8:16 PM IST
హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని నిర్మాణంలో ఉన్న భవనంపైకి తీసుకుని వెళ్లి కొట్టి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మధ్యప్రదేశ్‌కు చెందిన వచ్చిన ఓ జంట 15 రోజుల క్రితం వనస్థలిపురంలోని శక్తినగర్‌లో అద్దెకు దిగారు. వాసవి నిలయం భవనం నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ రోజు అదే అపార్ట్‌మెంట్ పైకి తీసుకుని వెళ్లిన యువకుడు ప్రియురాలి మీద దాడి చేశాడు. అనంతరం ఆమెను మూడో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. స్థానికులు కొందరు బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. ప్రియురాలిని భవనంపై నుంచి తోసేసిన తర్వాత ఆ యువకుడు పారిపోయాడు. పోలీసులు ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...