హైదరాబాద్‌లో రోడ్డు మీద శవంతో యువకుడి సెల్ఫీ...

ఓ వైపు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చనిపోయి, జనం కోపంలో ఉంటే.. మరోవైపు యువకుడు ఆ యువతి శవం వద్ద సెల్ఫీ తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు.

news18-telugu
Updated: November 26, 2019, 5:27 PM IST
హైదరాబాద్‌లో రోడ్డు మీద శవంతో యువకుడి సెల్ఫీ...
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సక్సేనా మృతదేహం వద్ద సెల్ఫీ తీసుకుంటున్న యువకుడు
  • Share this:
హైదరాబాద్ బంజారాహీల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 12లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న మహిళ తలపై నుంచి బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన జనం ఒక్కసారిగా తాత్కాలిక బస్సు డ్రైవర్‌పై దాడికి దిగారు. నిర్లక్ష్యంగా బస్ నడిపిన తాత్కాలిక ద్రైవర్‌ను చితకబాదారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతురాలు టాటా కన్సల్టెన్సీలో పనిచేస్తున్న సోహిని సక్సేనాగా గుర్తించారు. అయితే, ఓ వైపు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చనిపోయి, జనం కోపంలో ఉంటే.. మరోవైపు యువకుడు ఆ యువతి శవం వద్ద సెల్ఫీ తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు. ఫొటోలో తనతో పాటు శవం కూడా పడేలా చూసుకుని మరీ సెల్ఫీలు తీసుకున్నాడు.



First published: November 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>