'నా చావుకు ఎమ్మెల్యేనే కారణం'.. వరంగల్‌లో గొంతుకోసుకున్న వ్యక్తి

అమరవీరుల స్థూపం ముందు ఎందుకు ఆత్మాహత్యాయత్నం చేశాడు? దానికి ఎమ్మెల్యే ఎందుకు కారణం? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

news18-telugu
Updated: June 30, 2020, 6:35 PM IST
'నా చావుకు ఎమ్మెల్యేనే కారణం'.. వరంగల్‌లో గొంతుకోసుకున్న వ్యక్తి
అమరవీరుల స్థూపం ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
  • Share this:
హన్మకొండలో తీవ్ర కలకలం రేగింది. అదాలత్ వద్ద అమరవీరుల స్థూపం ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. చాకుతో గొంతు కోసుకొని అక్కడే పడుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు హుటాహుటిన అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని వరంగల్ అర్బన్ జిల్లా అలంకాని పేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లుగా గుర్తించారు. అతడి బ్యాగులో ఓ సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డే కారణమని అందులో రాశాడు వెంకటేశ్వర్లు. వచ్చే ఎన్నికల్లో సుదర్శణ్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని సీఎం కేసీఆర్‌కు సూసైడ్ నోట్ ద్వారా విజ్ఞప్తి చేశాడు.
ఘటనా స్థలంలో సూసైడ్ నోట్


ఐతే అమరవీరుల స్థూపం ముందు ఎందుకు ఆత్మాహత్యాయత్నం చేశాడు? దానికి ఎమ్మెల్యే ఎందుకు కారణం? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా స్పందించారు. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు. వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనా స్థలంలో చాకు
First published: June 30, 2020, 6:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading