HOME »NEWS »CRIME »youth stops lovers wedding by sending girls intimate photos to groom ba

ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ఒక్క వాట్సప్ మెసేజ్‌తో ఆపేసిన లవర్.. ఏపీలో విచిత్ర ఘటన

ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ఒక్క వాట్సప్ మెసేజ్‌తో ఆపేసిన లవర్.. ఏపీలో విచిత్ర ఘటన
ప్రతీకాత్మక చిత్రం

ప్రియుడి కారణంగానే తమ కూతురి పెళ్లి ఆగిపోయిందని తెలిసిన యువతి తల్లిదండ్రులు ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

  • Share this:
    మీరు ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా చూశారా?. సినిమా చివరి వరకు అంతా బాగానే ఉంటుంది. జస్ట్ బ్రహ్మానందం తీసిన ఒక్క ఫొటో మొత్తం పెళ్లి పెటాకులు చేస్తుంది. హీరో, హీరోయిన్‌‌ను కలుపుతుంది. అక్కడ బ్రహ్మానందం తెలియక చేసిన పని వెంకటేష్‌కి బాగా కలిసొస్తుంది. అయితే, ఇక్కడ ఏకంగా ఓ లవర్ తన ప్రియురాలి పెళ్లి ఆపడానికి అలాంటి పనే చేశాడు.  తన ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి జరిపిస్తున్నారని ఓ ప్రియుడు.. పెళ్లికొడుక్కి తన ప్రేయసితో కలిసి దిగిన ఫొటోలను వాట్సాప్ లో పంపి పెళ్లిని ఆపేశాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పరిధిలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామానికి చెందిన ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి అమ్మాయి తరపు వారు ఒప్పుకోలేదు. ఆ యువతికి మరో సంబంధం చూసి పెళ్లి చేయాలని నిశ్చయించారు. పెళ్లి తేదీ దగ్గర పడుతుండటంతో ఆ ప్రియుడు.. పెళ్లి కొడుకు ఫోన్ నెంబర్ ను సంపాదించాడు. ఆ పెళ్లికొడుకు వాట్సప్ కు తన ప్రేయసితో కలిసి దిగిన ఫొటోలను పంపాడు. వారిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూసిన పెళ్లి కొడుకు తనకు ఈ పెళ్లి వద్దని తన తల్లిదండ్రులకు చెప్పేశాడు. దీంతో బుధవారం జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది.

    ప్రియుడి కారణంగానే తమ కూతురి పెళ్లి ఆగిపోయిందని తెలిసిన యువతి తల్లిదండ్రులు ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.



    (Source: SuryaEPaper)
    First published:January 21, 2021, 21:44 IST

    टॉप स्टोरीज