‘ఈ పార్టీ ఏంటి.. గోల ఏంటి’ అన్నందుకు మహిళను...

ప్రతీకాత్మక చిత్రం

తన ఫ్రెండ్స్ ముందు తనను అవమానించిందన్న కోపంతో భరత్ వెళ్లి.. భాగ్యమ్మతో వాగ్వాదానికి దిగాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఓ దశలో భాగ్యమ్మ అతడిని చీపురుకట్టతో కొట్టింది. చెయ్యి కొరికింది.

  • Share this:
    ఫ్రెండ్స్‌తో కలసి పార్టీ చేసుకుంటుంటే అడ్డు చెప్పినందుకు ఓ మహిళను కత్తితో పొడిచాడు. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. భరత్ కుమార్ అనే యువకుడు ఓ ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఆ ఇంటిపైన భాగ్యమ్మ అనే మహిళ కూడా అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో భరత్ కుమార్ తన ఫ్రెండ్స్‌తో కలసి తన రూమ్‌లో పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు. టీవీ సౌండ్ పెట్టి, ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ గోల చేస్తుండడంతో, ఇంటిపైన ఉండే భాగ్యమ్మ వచ్చి అతడితో గొడవపడింది. ఈ పార్టీ ఏంటి? గోల ఏంటి అంటూ తిట్టింది. చాలా సేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ ఎందుకు అనుకున్న ఫ్రెండ్స్.. కొద్దిసేపటి తర్వాత భరత్ రూమ్ నుంచి తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. తన ఫ్రెండ్స్ ముందు తనను అవమానించిందన్న కోపంతో భరత్ వెళ్లి.. భాగ్యమ్మతో వాగ్వాదానికి దిగాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఓ దశలో భాగ్యమ్మ అతడిని చీపురుకట్టతో కొట్టింది. చెయ్యి కొరికింది. దీంతో భరత్.. కత్తితో భాగ్యమ్మను పొడిచాడు. అనంతరం భయంతో అక్కడి నుంచి పారిపోయాడు.
    First published: