Lovers: మెడికల్ షాప్‌లో పనిచేసే కుర్రాడు.. బ్యాంకులో పనిచేసే అమ్మాయి.. ఇప్పుడు ఇద్దరూ లేరు..

సందేశ్, సౌమ్య (ఫైల్ ఫొటోలు)

కర్నాటకలో మహిళలపై అమానుష ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బెంగళూరులో అనిత అనే యువతిని ఆమె సహోద్యోగి వెంకటేష్ నడిరోడ్డుపై గొంతు కోసి హత్య చేసిన ఘటన జరిగి రోజులు కూడా గడవక ముందే కర్నాటకలో మరో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ యువతి గొంతు కోసి, ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరూ చనిపోయారు.

 • Share this:
  బెంగళూరు: కర్నాటకలో మహిళలపై అమానుష ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బెంగళూరులో అనిత అనే యువతిని ఆమె సహోద్యోగి వెంకటేష్ నడిరోడ్డుపై గొంతు కోసి హత్య చేసిన ఘటన జరిగి రోజులు కూడా గడవక ముందే కర్నాటకలో మరో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఓ యువతి గొంతు కోసి, ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరూ చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉడిపికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన సందేష్ కులాల్ (29) అనే యువకుడు ఉడిపిలోని ఓ మెడికల్ షాప్‌లో పనిచేస్తున్నాడు. సౌమ్య అనే యువతి ఉడిపిలోని ఓ బ్యాంకులో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తోంది. ఈ ఇద్దరికీ ఏడేళ్ల నుంచి పరిచయం ఉంది. ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. ఆ తర్వాత ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది.

  ఈ మధ్య వీరి ప్రేమ వ్యవహారం సౌమ్య తల్లిదండ్రులకు తెలిసింది. ఇంట్లో పెద్ద గొడవైంది. దీంతో.. ఇంట్లో వాళ్లకు మన ప్రేమ ఇష్టం లేదని.. ఇద్దరం విడిపోదామని సందేశ్‌కు సౌమ్య చెప్పింది. అయితే.. అందుకు సందేశ్ ఒప్పుకోలేదు. ఇంట్లో ఇబ్బంది అవుతుందని.. తనతో మాట్లాడవద్దని.. దూరంగా ఉందామని ఆమె ఎంత చెప్పినా సందేశ్ వినిపించుకోలేదు. అదేం కుదరదని.. తనతో మాట్లాడాలని.. మునుపటిలా ఉండాలని సందేశ్ సౌమ్యను బలవంతం చేశాడు. వద్దని ఎన్నిసార్లు చెప్పినా ఫోన్లు చేస్తూ ఆమెను ఇబ్బందిపెట్టాడు. ఆమె బయట కనిపిస్తే తనను ప్రేమించాలని.. తననే పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసేవాడు.

  సందేశ్ కూతురిని ఇబ్బందిపెడుతున్న విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేసి.. పంపించాలని భావించారు. ఆమెకు ఓ సంబంధం చూశారు. సౌమ్యకు కొద్దిరోజుల క్రితమే నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ పరిణామంతో సందేశ్ సైకోలా మారాడు. తనను కాదని సౌమ్య వేరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటుందంటూ కోపంతో రగిలిపోయాడు. తనకు దక్కని సౌమ్య వేరెవరికీ దక్కకూడదని భావించి ఆమెను చంపేయాలని.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే.. గత సోమవారం రోడ్డుపై వెళుతున్న సౌమ్యను సందేశ్ బైక్‌పై వెంటాడి మరీ అడ్డగించాడు. ఆమెతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. నడిరోడ్డుపై అందరూ వాళ్లనే చూస్తున్నారు.

  ఇది కూడా చదవండి: Shocking: నీ అఫైర్ పిచ్చి పాడుగానూ.. రెండున్నర గంటల క్రైం సినిమానే చూపించావుగా.. వర్మ సినిమా తీసినా తీస్తాడేమో..

  డ్యూటీకి వెళ్లి వస్తున్నానని.. తనకు నిశ్చితార్థం కూడా జరిగిందని, మర్చిపోవాలని సౌమ్య సందేశ్‌కు చెప్పి స్కూటీపై వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. ఆమె స్కూటీని ఆపి ఉన్మాదిగా మారిన సందేశ్ తొలుత ఆమె గొంతు కోసి హత్య చేశాడు. గొంతు కోయడంతో సౌమ్య తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిపోయింది. ఆ తర్వాత సందేశ్ కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇద్దరినీ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. సోమవారం రాత్రి సౌమ్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. సందేశ్ మంగళవారం చనిపోయాడు. పట్టపగలు నడిరోడ్డుపై.. అదీ ఉడిపి మెయిన్ రోడ్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
  Published by:Sambasiva Reddy
  First published: