హోమ్ /వార్తలు /క్రైమ్ /

మంటల్లో కాలిపోతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన యువకుడు.. ఏం జరిగిందంటే..

మంటల్లో కాలిపోతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన యువకుడు.. ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. మంటల్లో కాలిపోతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అగ్నికీలల్లో చిక్కుకున్న అతడిని చూసి పోలీస్‌లు షాక్ తిన్నారు.

  ఇటీవల కాలంలో ఆత్మహత్య ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తండ్రి మందలించాడని ఒకరు.. ప్రియుడు మోసం చేసిందని మరొకరు.. ఆర్థిక సమస్యలతో ఇంకొకరు.. ఇలా సమస్య ఏదైనా... ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. సమస్యను ధైర్యంగా ఎదుర్కోకుండా... బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్నచిన్న కారణాలకే సూసైడ్ చేసుకుంటున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొన నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలిపోతూనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగింది..?

  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..  బిలాస్‌పూర్ నగరలోని దీన్‌దయాళ్ వార్డుకు చెందిన సమీర్ ఖాన్ శనివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. మంటల్లో కాలిపోతూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అగ్నికీలల్లో చిక్కుకున్న అతడిని చూసి పోలీస్‌లు షాక్ తిన్నారు. వెంటనే డోర్ కర్టెన్‌తో మంటలను ఆర్పేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. అడిషనల్ ఎస్పీ కార్యాలయం సమీపంలోనే ఈ ఘటన జరగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.

  Shocking : వీడు మనిషేనా..కన్నకూతురిపై తండ్రి అత్యాచారం..బాలిక ప్రెగ్నెంట్ అవడం

  ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సమయంలో అతని నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తాను ఓ అమ్మాయిని 4-5 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని.. ఆమెను ఎంతో నమ్మి లక్షా ఎనభై వేల రూపాయలు ఇచ్చానని అందులో రాశాడు. కానీ ఆమె తనను మోసం చేసిందని.. కేవలం డబ్బు కోసమే ప్రేమిస్తున్నట్లు నటించిందని అందులో ఆరోపించాడు.

  అంతకు రెండు రోజుల క్రితం కూడా అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. విషం తాగడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం.. ఆస్పత్రి భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. తాను ఖచ్చితంగా చనిపోతానని.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.  ఈ క్రమంలోనే శనివారం  రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.  ఐతే అతడి తల్లిదండ్రుల వర్షన్ మాత్రం వేరేలా ఉంది.  ఓ కానిస్టేబుల్ వేధింపులను తాళలేకే.. తమ కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశాడని వాపోతున్నారు.

  ఏంది గంజాయి స్మగ్లింగ్‌ కూడా పుష్ప స్టైల్లోనేనా..అందుకే దొరికిపోయారు

  మరోవైపు బాలిక తరపు వారు కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ వాదన వినిపించారు. తమ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడని.. అతడికి నాలుగేళ్ల క్రితమే పెళ్లయిందని పోలీసులుకు చెప్పారు. ఇద్దరు పిల్లలు కూడ ఉన్నారని ఆరోపించారు. ఐనప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి... ప్రేమ పేరుతో తమ కూతురిని మోసం చేశాడని వివరించారు.  దాని గురించి నిలదీసినందుకే.. ఇప్పుడు డబ్బుల పేరుతో డ్రామాలాడుతున్నాడని చెప్పారు.  ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి..అందరినీ విచారిస్తున్నారు. వీరిలో ఎవరు నిజం చెబుతున్నారు?ఎవరు అబద్దం చెబుతున్నారో తేల్చేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.   


  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Chhattisgarh, Crime news, National News

  ఉత్తమ కథలు