వారిద్దరు ప్రేమికులు. ఇద్దరూ మాదక ద్రవ్యాలు తీసుకుంటారు. ఏమీ దొరక్కపోతే వైట్నర్ పీల్చుకొనైనా మత్తులో తూలేవారు. అంతలా డ్రగ్స్(Drugs)కు బానిసలయ్యారు. అదే మత్తులో ఓ హోటల్ గదిలో వీరిద్దరు ఇటీవల శృంగారంలో పాల్గొన్నారు. సమయానికి కండోమ్ లేకపోవడంతో అతడు తన వద్ద జిగురు పదార్థాన్ని ప్రైవేట్ పార్ట్స్‌కు రాసుకున్నాడు. ఆమె గర్భం దాల్చకూడదన్న ఉద్దేశంతో జిగురు (Adhesive) రాసుకొని శృంగారంలో పాల్గొన్నాడు. కానీ అంతలోనే ఘోరం జరిగింది. ఆ మరుసటి రోజే అతడు శవమై తేలాడు. రోడ్డుపక్కన పొదల్లో మృతదేహం లభ్యమయింది. ఆ జిగురే అతడి ప్రాణం తీసిందా? పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. అహ్మదాబాద్ (Ahmedabad)లోని ఫతేవాడి ప్రాంతానికి చెందిన యువకుడు (25), మరో యువతి ప్రేమించుకుంటున్నారు. మరో మహిళతో కలిసి వీరిద్దరు ఆగస్టు 22న ఓ హోటల్‌కు వెళ్లారు. అప్పటికే వారు డ్రగ్స్ తీసుకున్నారు. ఆ మత్తులో హోటల్ గదిలో శారీరకంగా కలవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే హోటల్ గదిని అద్దెకు తీసుకున్నారు. కానీ కండోమ్ మరిచిపోయాడు. ఏం చేయాలో అర్ధం కాలేదు. మళ్లీ బయటకు వెళ్లి తెచ్చుకునేంత ఓపిక ఇద్దరికీ లేదు. వీరు అప్పుడప్పుడూ వైట్నర్, జిగురు కలిపి.. కిక్కు కోసం ఆ మిశ్రమాన్ని పీల్చుతారు. అందుకే ఎప్పుడూ గమ్‌ని తమ వెంట తీసుకెళ్తారు.
Chicken Fry: బెంగళూరులో షాకింగ్ ఘటన.. ఆ ఇల్లాలి జీవితానికి ముగింపు పలికిన చికెన్ ఫ్రై..
శారీరంగా కలిసేందుకు కండోమ్ లేకపోవడంతో..తమ వెంట తెచ్చుకున్న జిగురు ప్రైవేట్ పార్ట్‌కు రాసుకొని అతడు శృంగారంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. కానీ మరుసటి రోజే ఆ యువకుడు అంబర్ టవర్ ప్రాంతంలోని ముళ్ల పొదల్లో శవమై తేలాడు. ఇంటి నుంచి కుమారుడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబర్ టవర్ ప్రాంతంలో యువకుడి మృతదేహం లభించడం.. తమ కుమారుడు అదృశ్యమైనట్లుగా ఓ మిస్సింగ్ కేసు నమోదవడంతో.. వారిని పిలిచి యువకుడి మృతదేహాన్ని చూపించారు పోలీసులు. అది తమ కుమారుడే అని గుర్తించి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Tragedy news : కొడలుపై కేసు కోసం 22 రోజులుగా కొడుకు శవాన్ని ఇంట్లో పెట్టుకున్న తండ్రి..!
అతడు ఎలా చనిపోయాడో పోలీసులకు అర్ధం కాలేదు. ప్రమాదమా? హత్యా? ఆత్మహత్యా? అని తెలుసుకునేందుకు చుట్టు పక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలన్నీ పరిశీలించారు. మహిళ, యువతితో కలిసి అతడు హోటల్ గదిలోకి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆ ముందు రోజు జరిగిన దాని గురించి వివరించారు. తామిద్దరు ప్రేమికులమని.. హోటల్ గది అద్దెకు తీసుకొని శారీరకంగా కలిశామని ఆ యువతి పోలీసులకు చెప్పింది. అంతకు మించి తనకేమీ తెలియదని చెప్పింది. ఐతే కండోమ్ లేకపోవడంతో జిగురు పదార్థాన్ని వినియోగించామని వెల్లడించింది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తుచేశారు.
Viral: అత్త నిందలేసిందని భర్త కళ్ల ముందే నిప్పులపై నడిచిన కోడలు.. వైరల్‌గా మారిన వీడియో
ఘాటైన జిగురు పదార్థాన్ని మర్మాంగాలకు రాసుకొని.. శృంగారంలో పాల్గొనడం వలన అతడి ఆరోగ్యం విషమించిందని పోలీసులు చెప్పారు. శరీరంలోని అవయవాలు పనిచేయపోవడంతో మరణించాడని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మరింత స్పష్టత వస్తుందని వెల్లడించారు. మృతుడికి తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.ఆ ఫ్యామిలీ మొత్తం అతడిపైనే ఆధారపడి జీవిస్తోంది. అతడు మరణించడంతో కుటుంబం మొత్తం రోడ్డునపడింది. తమ వాడిని తలచుకొని అందరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ahmedabad, Crime, Crime news, Gujarat