భద్రాచలంలోని ఓ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు భరత్. పనీపాటాలేని ఆవారాలా కాకుండా... బూర్గంపాడు మండలంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎండాకాలం రావడంతో ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో వాటర్ సమస్య తలెత్తుతోంది. సరిగ్గా ఆఫీస్‌కి వెళ్లే సమయానికి కుళాయిలో వాటర్ రావట్లేదు. ఇంటి ఓనర్ని అడిగితే... వచ్చేస్తాయి అంటాడే తప్ప అవి రావు. విసుగెత్తిన భరత్... మూడు నెలల కిందట తాను అద్దెకు ఉన్న ఇంటికే తిరిగి వెళ్లిపోవాలని అనుకున్నాడు. వీకాఫ్ రోజున ఆ ఇంటికి వెళ్లాడు. అదో మూడంతస్థుల భవనం. అందులో పైన పెంట్ హౌస్ లాగా చిన్న గది ఉండేది. ఆ గదిలోనే ఇదివరకు ఉండేవాడు భరత్. ఇప్పుడా రూం ఖాళీగా ఉందేమో తెలుసుకుందామని ఆ భవనం దగ్గరకు వెళ్లాడు.
ఆ ఇంటి ఓనర్ ఉండేది గ్రౌండ్ ఫ్లోర్లో. భరత్ వెళ్లిన సమయంలో... ఇంట్లో ఓనర్ కూతురు కృష్ణవేణి (పేరు మార్చాం) ఒక్కత్తే ఉంది. ఇంతకు ముందు అక్కడే ఉండేవాడు కావడంతో... కృష్ణవేణి అతన్ని గుర్తుపట్టింది. దాహంగా ఉంది మంచినీళ్లు కావాలని అడిగిన భరత్... మీ నాన్నగారు లేరా అని అడిగాడు. తెలిసినవాడే కావడంతో ఆమె గబుక్కున ఇంట్లో ఎవరూ లేరనీ, నాన్న రావడానికి చాలా టైం పడుతుందని అనేసింది. ఆమె మంచినీళ్లు తేవడానికి కిచెన్ లోకి వెళ్లగానే... భరత్ మైండ్‌లో కన్నింగ్ ఆలోచనలు బయలుదేరాయి. ఆమె కిచెన్‌లో ఉండగానే... గబగబా ఆ ఇంట్లోకి వెళ్లి... మెయిన్ డోర్ వేసేశాడు. మంచినీళ్లతో వచ్చిన కృష్ణవేణి... ఇంట్లోకి వచ్చేసిన ఆతన్ని చూసి ఆశ్చర్యపోయింది. చెప్పానుగా నాన్నగారు లేరని, ఆయన సాయంత్రం వస్తారు. మీరు అప్పుడు రండి అంటూ మంచినీళ్లు ఇచ్చింది.
వాటర్ తీసుకున్న భరత్... వాటిని తాగకుండా పక్కన పెట్టి... మెల్లిగా ఆమె దగ్గరకు జరగసాగాడు. ఆమెకు డౌట్ వచ్చింది. అవతల డోర్ గడియ వేసి ఉంది. అంతే... ఆమె ఏంటిది... ఏం చేస్తున్నారు... వెళ్లండి ఇక్కడి నుంచీ అంటూ అరవబోతుంటే... ఆమె నోరు నొక్కేశాడు. ఆమె ఎంతలా గింజుకుంటున్నా వదలకుండా... పక్కనే ఉన్న బెడ్రూంలోకి లాక్కుపోయాడు. అలా ఆమెను రేప్ చేసిన భరత్... అక్కడి నుంచీ పారిపోయాడు.
సాయంత్రం ఇంటికి వచ్చిన పేరెంట్స్‌కి విషయం చెప్పి బోరున ఏడ్చింది కృష్ణవేణి. ఆమె పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్‌తో పోలీసులు వేట మొదలుపెట్టారు. ప్రస్తుతం భరత్ పరారీలో ఉన్నాడు. రేపో మాపో దొరికినప్పుడు ఎలాగూ తాటతీస్తారు. బట్... కృష్ణవేణికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదు. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు భద్రాచలం పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.