హోమ్ /వార్తలు /క్రైమ్ /

Selfie With Gun: పిస్తోల్ తో స్వీయ చిత్రం.. తీసింది ప్రాణం..

Selfie With Gun: పిస్తోల్ తో స్వీయ చిత్రం.. తీసింది ప్రాణం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మొబైల్స్ కు ఫ్రంట్ కెమెరా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ పిసి శ్రీరాంలు, డబూ రత్నానీలు అయిపోతున్నారు. కానీ ఆ క్రమంలో ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లి.. అజాగ్రత్తతో తమ ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు.

  • News18
  • Last Updated :

మొబైల్స్ కు ఫ్రంట్ కెమెరా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ పిసి శ్రీరాంలు, డబూ రత్నానీలు అయిపోతున్నారు. కానీ ఆ క్రమంలో ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లి.. అజాగ్రత్తతో తమ ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. సదరు ప్రదేశంలో తాను ఉన్నానని సామాజిక మాధ్యమిక ప్రపంచానికి చెప్పడానికో.. లేక వేరెవరూ చేయని ఫీట్ తానే చేస్తున్నందుకో గానీ.. ప్రమాదకరమైన ఫీట్లను చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. నోయిడాలో ఒక వ్యక్తి పిస్తోల్ తో సెల్ఫీ ఫోజులిస్తుండగా.. అది పేలడంతో అతడి ప్రాణాలు పోయాయి. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

ఢిల్లీకి సమీపంలో ఉన్న నోయిడా లోని ఖేదా దర్పురా గ్రామానికి చెందిన సౌరభ్(22) ఆదివారం ప్రమాదకర స్థితిలో చనిపోయాడు. పిస్తోల్ తో సెల్ఫీ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. పిస్తోల్ తో సెల్ఫీ తీసుకోవాలనుకునే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిస్తోల్ లో బుల్లెట్ లు లేవనుకున్న సౌరభ్.. దానిని పాయింట్ బ్లాంక్ లో పెట్టుకుని కాల్చుకుంటున్నట్టు ఫోటో దిగబోయాడు. పలుమార్లు దిగినా అతడికి అది సరిపోలేదనిపించింది.

దీంతో మరోమారు పిస్తోల్ ను సరిచేస్తుండగా అది ఒక్కసారిగా పేలింది. దీంతో బుల్లెట్ సరాసరి సౌరభ్ ఛాతిలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అక్కడకు తన స్నేహితుడు నకుల్ వచ్చాడు. నకుల్ వచ్చేసరికి రక్తపు మడుగులో పడిఉన్న సౌరభ్. దీంతో వెంటనే అతడు సౌరభ్ ను ఆస్పత్రికి తరలించాడు. కానీ డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. బుల్లెట్ ఛాతిలో దిగడం వల్ల అతడు శ్వాస కోల్పోయాడని వైద్యులు తెలిపారు.

కాగా ఈ కేసుపై పోలీసులు స్పందిస్తూ.. సౌరభ్ కు తుపాకీ ఎక్కడ్నుంచి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్షకు పంపామని చెప్పారు. సౌరభ్ స్థానికంగా ఉన్న ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడని.. కానీ సెల్ఫీ మోజు ఆయన ప్రాణం తీసిందని అతడి స్నేహితుడు నకుల్ తెలిపారు.

గతంలోనూ ఇలాంటి తరహా మరణాలు పలుమార్లు సంభవించినా.. యువతలో మార్పు రావడం బాధాకరమని పోలీసులు చెబుతున్నారు.  నదులు, ప్రమాదకర వంతెనలు, ఎత్తైన కొండల వంటి ప్రాంతాలకెళ్లే యువత.. అక్కడ సెల్ఫీ తీసుకుంటూ అందులో పడిపోతుండటంతో అత్యంత దారుణంగా చనిపోతున్నారు.  కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నారు. చేతికొచ్చిన బిడ్దలు.. భవిష్యత్ లో తమకు ఆసరా అవుతారనుకుంటే.. కళ్లముందే విగతజీవులుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రుల గుండెలవిసిపోతున్నాయి.

First published:

Tags: Gun fire

ఉత్తమ కథలు