కొంపముంచిన లింక్... రూ.4 లక్షలు హాంఫట్

కొంపముంచిన లింక్... రూ.4 లక్షలు హాంఫట్

Online Cheating : మనకు పోలీసులు ఎన్నోసార్లు చెప్పారు... ఇంటర్నెట్‌లో అపరిచితులు పంపే లింక్‌లు క్లిక్ చెయ్యవద్దని. మరి ఆ యువకుడు ఎలా బుక్కయ్యాడు? లింక్ ఎందుకు క్లిక్ చేశాడు?

 • Share this:
  Online Cyber Crime Cheating : ఉత్తరప్రదేశ్... లక్నోలోని గోమతీనగర్‌కి చెందిన ధనుంజయ్ (పేరు మార్చాం)కి ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా ఫుడ్ డెలివరీ తెప్పించుకోవడం అలవాటు. తాజాగా ఓ ఫేమస్ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డరిచ్చాడు. డబ్బు చెల్లించాడు. 45 నిమిషాల్లో ఫుడ్ వచ్చింది. తీరా వచ్చాక, అది అతనికి నచ్చలేదు. ఇదేంటి ఇలావుంది. నేను అడిగింది అలా ఉంటుంది కదా అన్నాడు. డెలివరీ బాయ్... అవన్నీ మాకు తెలియదు సార్... మీరు ఆర్డరిచ్చిందే తెచ్చాను అన్నాడు. లేదు లేదు... నాకిది నచ్చలేదు. నాకొద్దు. మనీ ఇచ్చేయండి. అని రిటర్న్ ఇచ్చేశాడు. డెలివరీ బాయ్... మనీ రిటర్న్ ఇవ్వాలంటే... ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ పెట్టుకోవాలి సార్... అంటూ ఫుడ్ వెనక్కి తీసుకొని వెళ్లిపోయాడు.

  డెలివరీ బాయ్ వెళ్లిపోయాక... ఆ యాప్ కస్టమర్ కేర్ నంబర్‌ను గూగుల్ సెర్చ్‌లో సంపాదించాడు ధనుంజయ్. ఆ నంబర్‌కి ఫోన్ చెయ్యగానే... అవతలి నుంచీ ఓ వ్యక్తి కాల్ రిసీవ్ చేసుకున్నాడు. తనను పరిచయం చేసుకున్నాడు. ధనుంజయ్ విషయం అతనికి చెప్పాడు. "ఓకే నోప్రాబ్లం... మీ మనీ మీకు ఇచ్చేస్తాం. డోంట్ వర్రీ" అంటూ... నేను ఓ లింక్‌ను మీకు మెసేజ్‌ ద్వారా పంపిస్తాను. దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఓ యాప్ డౌన్‌లోడ్ అవుతుంది. అది ఇన్‌స్టాల్ అయ్యాక, అందులో మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వండి. వెంటనే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చెయ్యగానే... మీ మనీ మీకు వస్తుంది అని చెప్పాడు.

  లింక్ పంపడం... దాన్ని ధనుంజయ్ క్లిక్ చెయ్యడం... అది డౌన్‌లోడ్ అయ్యి ఇన్‌స్టాల్ అవ్వడం అన్నీ జరిగిపోయాయి. తర్వాత బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చాడు. ఓటీపీ వచ్చింది. ఎంటర్ చేశాడు. వెంటనే ఓ మెసేజ్ వచ్చింది. డబ్బు రిటర్న్ వచ్చేసి ఉంటుందిలే అని ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు. షాక్ అయ్యాడు. ఏంటంటే అతని అకౌంట్ నుంచీ ఏకంగా రూ.4 లక్షలు మాయమయ్యాయి. ధనుంజయ్‌కి దిమ్మతిరిగింది. వెంటనే ఆ నంబర్‌కు కాల్ చెయ్యగా... స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ధనుంజయ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కానీ మోసగాళ్లు ఎవరో కనిపెట్టడం కష్టమే అంటున్నారు పోలీసులు.

  ఇదీ జరిగిన మోసం : గూగుల్‌లో కనిపించే లింకులన్నీ నిజమైనవే అనుకోవద్దు. హ్యాకర్లు ఆయా బ్యాంకులు, సంస్థల పేరుతో నకిలీ లింకులు క్రియేట్ చేస్తుంటారు. వాటిని క్లిక్ చేసి... వాటిలో నంబర్లకు కాల్ చేస్తే... అంతే సంగతులు. అడ్డంగా మోసపోతాం. ఏ లింకైనా క్లిక్ చేసిన తర్వాత... దాని అడ్రెస్ బార్‌లో... https అనేది ఉండాలి. నకిలీ లింకులకు http మాత్రమే ఉంటుంది. s అంటే సెక్యూర్డ్ అని అర్థం. అది లేకపోతే, ఆ సైడ్ డూప్లికేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇకపై అలాంటి నకిలీ లింకులతో జాగ్రత్త పడండి.


  Pics : క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్న హిప్పీ బ్యూటీ దిగంగన
  ఇవి కూడా చదవండి :

  Diabetes Tips : పసుపుతో డయాబెటిస్‌కి చెక్... ఎలా వాడాలంటే...

  క్లౌడ్ బెర్రీస్ విశేషాలు తెలుసా... టేస్ట్ ఎలా ఉంటాయి?


  Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు


  Health Tips : బరువు తగ్గాలా... అలోవెరాతో ఇలా చెయ్యండి...

  Published by:Krishna Kumar N
  First published: