YOUTH KILLS MOTHER FOR DENYING HIM RS 100 TO PURCHASE DRUGS PVN
Shocking : రూ.100 కోసం..తల్లి పట్ల ఏ కొడుకూ చేయని పని చేశాడు!
ప్రతీకాత్మక చిత్రం
Shocking : ఆస్తుల కోసం కనిపెంచిన తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే దుర్మార్గులు భూమ్మీద చాలామందే ఉన్నారు. తల్లిదండ్రుల్ని హత్య చేసే దుర్మార్గులు కూడా అక్కడక్కడా ఉంటారు.
Shocking : ఆస్తుల కోసం కనిపెంచిన తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే దుర్మార్గులు భూమ్మీద చాలామందే ఉన్నారు. తల్లిదండ్రుల్ని హత్య చేసే దుర్మార్గులు కూడా అక్కడక్కడా ఉంటారు. అలాంటి వారిలో వీడు కూడా ఒకడు. వ్యసనాలకు బానిసై..నవమాసాలు మోసిన తల్లినే అత్యంత దారుణంగా కొట్టి చంపాడు. ఒడిషా రాష్ట్రంలోని మయూర్భంజ్ జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగింది.
ఒడిషా(Odisha) రాష్ట్రంలోని మయూర్భంజ్ జిల్లాలోని జషిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హటా పడియా దగ్గర్లో నివసించే సరోజ్ నాయక్ ఓ యువకుడు కొన్నాళ్లుగా డ్రగ్స్ కు బానిసయ్యాడు. మొదట్లో మందు,తర్వాత మొల్లిగా అన్ని వ్యసనాలు అబ్బాయి. అయితే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి సరోజ్ నాయక్ ఓ గుదిబండలాగా మారాడు. ఇంట్లో ఎక్కడ రూపాయి కనబడినా వదలకుండా ఎత్తుకెళ్లి మత్తులో తూగుతుండేవాడు. అయితే తమ కుమారుడిని ఎలాగైనా ఈ వ్యసనాల నుంచి దూరం చేయాలని భావించారు తల్లిదండ్రులు. అయితే మంచి మాటలు ఆ యువకుడి చెవుల్లోకి వెళ్లలేదు. నాకు డబ్బులు ఇస్తారా..చస్తారా అనే స్టేజ్ కి వెళ్లాడు.
ఈ క్రమంలో శనివారం తన తల్లి షాలందీ నాయక్ ని డ్రగ్స్ కొనుక్కోవడం కోసం రూ.100 అడిగాడు సరోజ్ నాయక్. అయితే కొడుకు అడిగిన డబ్బులు ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. రూ.100 ఉన్నప్పటికీ కుమారుడు తప్పుదోవ పడుతున్నాడన్న బాధతో డబ్బులు ఇవ్వకుండా అన్నా ఉంటే సైలెంట్ గా ఉంటాడనుకుంది ఆ పిచ్చి తల్లి. అయితే డబ్బులివ్వలేదన్న కోసం కసాయిగా మారాడు కుమారుడు. కన్న తల్లి అని కూడా చూడకుండా కర్రతో చావగొట్టాడు. వద్దు..వద్దు అంటూ ఆ తల్లి ఎంత బ్రతిమలాడినా వదిలిపెట్టలేదు(Son Beats Mother To Death). చివరకి ఆ దెబ్బలకు తల్లి మరణించడంతో..పోలీసులు పట్టుకుంటారన్న భయంతో అక్కడి నుంచి యువకుడు పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సరోజ్ నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.