హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking : ప్రియురాలి గోంతుకోసి..చెట్టుకు ఉరేసుకున్న యువకుడు!

Shocking : ప్రియురాలి గోంతుకోసి..చెట్టుకు ఉరేసుకున్న యువకుడు!

ప్రియురాలిని చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

ప్రియురాలిని చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

Youth kills girl and commits suicide : 21 ఏళ్ల యువకుడు ఓ యువతిని గొంతుకోసి హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన తిరువనంతపురంలోని కల్లారాలో చోటుచేసుకుంది. హత్యకు గురైన బాలికను కల్లారాలోని పజవిలా ప్రాంతానికి చెందిన సుమిగా గుర్తించారు.

ఇంకా చదవండి ...

Youth kills girl and commits suicide : 21 ఏళ్ల యువకుడు ఓ యువతిని గొంతుకోసి హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కేరళ(Kerala) రాష్ట్రంలోని తిరువనంతపురంలోని కల్లారాలో చోటుచేసుకుంది. హత్యకు గురైన యువతిని కల్లారాలోని పజవిలా ప్రాంతానికి చెందిన సుమి(Sumi)గా గుర్తించారు. వెంజరమూడ్‌లోని కీజయిక్కోణంకు చెందిన ఉన్ని(Unni) అనే యువకుడు సుమీని హత్య చేసిన తర్వాత కల్లారా శివార్లలో ఉరివేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సుమీ(18), ఉన్ని(21)కి చాలా కాలంగా పరిచయం ఉంది. దాదాపు మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు, ఉన్ని.. సుమీకి దూరపు బంధువు కూడా. అయితే ఇటీవల సుమీ తల్లిదండ్రులు తమ కూతురిని ఉన్నికి కాకుండా మరో యువకుడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. సుమీ కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ యువకుడితో సుమీ సన్నిహితంగా ఉంటున్నట్లు ఉన్ని భావించాడు. కొత్త రిలేషన్ షిప్ పై సుమీతో మాట్లాడేందుకు పలుమార్లు ఉన్ని ప్రయత్నించాడు. ఈ విషయమై గత కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సుమి వారం రోజుల క్రితం ఎనిమిది నిద్ర మాత్రలు మింగింది. దీంతో కుటుంబ సభ్యులు సుమీని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఉన్ని కూడా మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే ఇద్దరూ సేఫ్ గా హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వేరే యువకుడితో సంబంధాన్ని చూపి ఉన్ని తనను కొట్టాడని సుమీ కుటుంబ సభ్యులకు చెప్పింది.

OMG : ఫేస్ బుక్ లో మెసేజ్ లకు కు రిప్లై ఇవ్వట్లేదని..ఇంటికెళ్లి యువతిని కత్తితో పోడిచి చంపేశాడు!

దీంతో జూన్ 19(ఆదివారం)సాయంత్రం సుమి తల్లిదండ్రులు..ఉన్నికి ఫోన్ చేసి తమ ఇంటికి పిలిచారు. తమ కూతురిని వదిలిపెట్టాలని..నీవల్లే మా కూతురు మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది అని ఉన్నికి తెలిపారు సుమీ కుటుంబసభ్యులు. అయితే ఒక్కసారి సుమితో ఒంటరిగా మాట్లాడేందుకు అవకాశమివ్వాలని ఆమె కుటుంబసభ్యులకు ఉన్ని కోరాడు. దీనికి సుమి కుటుంబసభ్యులు అంగీకరించడంతో కొద్దిసేపు సుమికి నచ్చజెప్పి మళ్లీ తనతో ప్రేమ కొనసాగించేలా చేయాలని ఉన్ని ప్రయత్నించాడు. ఇదే సమయంలో చీకటిపడుతున్నా తమ కూతురు ఇంట్లోకి రాకపోవడంతో బయటకెళ్లి చూసిన సుమి కుటుంబసభ్యులకి వారు అక్కడ కనిపించలేదు. దీంతో సుమి-ఉన్ని కోసం వెతుకులాట ప్రారంభించారు. కొద్దిసేపటి తమ ఇంటికి సమీపంలోని రబ్బర్ ఫ్లాంట్ తోటలో సుమీ నేలపై అపస్మారక స్థితిలో పడి ఉండటం మరియు ఉన్నిని చెట్టుకు వేలాడుతూ కనిపించారు. రబ్బరు తోటలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని..ఈ క్రమంలోని సుమిని గొంతుకోసి హత్య చేసి అనంతరం రబ్బర్ ఫ్లాంట్ చెట్టుకు ఉరేసుకొని ఉన్ని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరువనంతపురం మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ఘటనపై పాంగోడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

First published:

Tags: Brutally murder, Kerala, Lovers