సారాతో పరిచయం.. ఆ తర్వాత వివాహేతర సంబంధం.. చివరకు ఏమైందంటే..

ధర్మరాజు వద్దకే వెళ్తుందని నిర్ధారణకు వచ్చిన కుళ్లయ్య.. ఆమె చాటుగా ఫాలో అయ్యాడు. జీడిమామిడి తోటలో ఉన్న ధర్మరాజు వద్దకు వెళ్లడం గమనించాడు. నేరుగా అక్కడికి వెళ్లి భార్యను కొట్టాడు.

news18-telugu
Updated: August 12, 2020, 3:03 PM IST
సారాతో పరిచయం.. ఆ తర్వాత వివాహేతర సంబంధం.. చివరకు ఏమైందంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అతడు ఓ కార్మికుడు. ఫ్యాక్టరీలో పనులు పూర్తయ్యాక సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు సారా తాగడం అలవాటు. సారా అమ్మే మహిళతో అలా పరిచయం పెరిగి, చివరకు వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచూ వారిద్దరు జీడిమామిడి తోటల్లో కలుసుకునేవారు. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి పక్కా ప్లాన్‌తో ఆమె ప్రియుడిని చంపేశాడు. మెడక్ మొబైల్ చార్జర్‌ వైర్‌ని చుట్టి, ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. విశాఖపట్టణం జిల్లా పరవాడ మండలం బండారుపాలెంలో ఈ ఘటన జరిగింది.

పరవాడ మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన ధర్మరాజు(40) అచ్యుతాపురంలోని ఓ కంపెనీల కార్మికునిగా పనిచేసేవాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ధర్మరాజుకు మద్యం అలవాటు ఉంది. కంపెనీలో పనులు ముగించుకున్న తర్వాత దిబ్బపాలెంలోని ఓ మహిళ ఇంటికి సారా తాగేందుకు వెళ్లేవాడు. ఆ మహిళతో పరిచయం పెంచుకొని, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆమె భర్త కుళ్లయ్యకు తెలిసింది. ధర్మరాజుపై కోపం పెంచుకున్న కుళ్లయ్య.. అతడిని చంపాలని ప్లాన్ చేశాడు. ఎప్పుడెప్పుడు దొరుకుతాడా? అని ఎదురుచూశాడు.

ఈ క్రమంలో ఆగస్టు 2న తన భార్య సారాతో పాటు కొంత డబ్బుతో బయటకు వెళ్లింది. ధర్మరాజు వద్దకే వెళ్తుందని నిర్ధారణకు వచ్చిన కుళ్లయ్య.. ఆమె చాటుగా ఫాలో అయ్యాడు. జీడిమామిడి తోటలో ఉన్న ధర్మరాజు వద్దకు వెళ్లడం గమనించాడు. నేరుగా అక్కడికి వెళ్లి భార్యను కొట్టాడు. అడ్డుకునేందుకు వచ్చిన ధర్మరాజుపైనా దాడి చేశాడు. అలా గొడవ పెద్దదవడంతో తన వద్ద ఉన్న మైబల్ చార్జర్ వైర్‌ను ధర్మరాజు మెడకు బిగించి చంపేశాడు. ధర్మరాజు ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య పరవాడ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టింది. ఆ తర్వాత మూడు రోజులకు జీడిమామిడి తోటలో ధర్మరాజు మృతదేహం లభ్యమైంది. ఆ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు.. కుళ్లయ్యే నిందితుడని గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Published by: Shiva Kumar Addula
First published: August 12, 2020, 3:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading