అనంతపురంలో హత్యకు దారి తీసిన ప్రేమ... 15 నెలల తరువాత...

తన ప్రేమకు స్నేహితుడు అడ్డు వస్తున్నాడని భావించిన ఓ యువకుడు... పథకం ప్రకారం అతడిని ముట్టుబెట్టాడు.

news18-telugu
Updated: February 21, 2020, 5:24 PM IST
అనంతపురంలో హత్యకు దారి తీసిన ప్రేమ... 15 నెలల తరువాత...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తన ప్రేమకు అడ్డొచ్చాడని ఏకంగా తన స్నేహితుడినే హత్య చేశాడు ఓ యువకుడు. అంతేకాదు ఈ హత్య కేసును మిస్సింగ్ కేసుగా మార్చి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. 15 నెలలపాటు ఈ కేసులో వాస్తవం బయటకు రాకుండా మేనేజ్ చేశాడు. అయితే ఎట్టకేలకు నిజం వెలుగులోకి వచ్చింది. స్నేహితుడిని చంపిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... తాడిమర్రి మండల మగుడుపల్లికి చెందిన వీరపుహరి, నవకిశోర్ ఇద్దరు స్నేహితులు. వీరపు హరి చెల్లెలిని ప్రేమించిన నవకిశోర్... ఈ విషయాన్ని హరికి చెప్పాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.

దీంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భావించిన హరిని చంపాలని భావించిన నవకిశోర్... 2018 డిసెంబర్‌లో హరిని మరో స్నేహితుడు శ్యామ్యూల్స్‌తో కలిసి బుక్కరాయసముద్రంకు తీసుకెళ్లాడు. ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అనంతరం హరిని బండరాయితో మోది చంపిన నవకిశోర్... అతడి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. అనంతరం అతడు కాలువలో పడి కొట్టుకుపోయాడని మద్యం మత్తులో ఉన్న మరో స్నేహితుడి శ్యామ్యూల్‌ను నమ్మించాడు. ఇదే విషయాన్ని హరి తల్లిదండ్రులకు చెప్పి వారితో మిస్సింగ్ కేసు పెట్టించాడు. అయితే ఈ కేసును లోతుగా విచారించిన పోలీసులు నవకిశోర్‌ను నిందితుడిగా గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు.


First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు