అతని టార్గెట్ పుష్పశ్రీవాణి... ఆమెపైనే అసభ్యకర పోస్టులు... అసలు కారణం ఇదీ...

AP Deputy Cm Pushpa Srivani : నెల్లూరికి చెందిన ఆ యువకుడు... మద్యం మత్తులో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి వ్యతిరేకంగా కామెంట్లు రాశానని చెబుతున్నా... అసలు విషయం వేరే ఉందని తేల్చారు పోలీసులు.

news18-telugu
Updated: February 24, 2020, 12:06 PM IST
అతని టార్గెట్ పుష్పశ్రీవాణి... ఆమెపైనే అసభ్యకర పోస్టులు... అసలు కారణం ఇదీ...
అతని టార్గెట్ పుష్పశ్రీవాణి... ఆమెపైనే అసభ్యకర పోస్టులు... అసలు కారణం ఇదీ...
  • Share this:
AP Deputy Cm Pushpa Srivani : ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు రాసిన నిందితుడు వెంకటేశ్వర్లును విజయనగరం జిల్లా పోలీసులు అరెస్టు చేసిన విషయం మనకు తెలుసు. ఐతే... ఫేస్‌బుక్‌లో అతను ఎందుకు ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు రాశాడన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అసలీ వివాదం మొదలైంది 2019 అక్టోబర్‌లో. అప్పట్లో ఈ కామెంట్లు కలకలం రేపడంతో... వైసీపీ నేతలు... విజయనగరం జిల్లా... చినమేరంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి నుంచీ పోలీసులు... ఆ కామెంట్లు ఎవరు రాశారా అని దర్యాప్తు జరిపితే ఇవి బెంగళూరు నుంచీ రాసినట్లు టెక్నికల్ అంశాల ద్వారా తెలిసింది. అక్కడకు వెళ్లి దర్యాప్తు చేసిన పోలీసులు... ఎట్టకేలకు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. ఇతను బెంగళూరులో ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడని తెలిపారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు అతన్ని పార్వతీపురం తీసుకెళ్లారు.

ఏపీలో ఎంతో మంది మంత్రులున్నారు. వాళ్లెవరి జోలికీ వెళ్లని వెంకటేశ్వర్లు... కేవలం డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి జోలికే ఎందుకు వెళ్లాడన్నదానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తాను మద్యం మత్తులో అసభ్యకర కామెంట్లు పెట్టాననీ... వేరే ఏ ఉద్దేశమూ లేదని వెంకటేశ్వర్లు చెబుతున్నాడు. అందులో ఎంతవరకూ నిజం ఉందన్నది పోలీసులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఓ అంచనా ప్రకారం... పుష్పశ్రీవాణి తరచుగా... సోషల్ మీడియాలో, టిక్‌టాక్‌లో వీడియోలు, ఫొటోలు పెడుతుంటారు. అందువల్ల ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల ఆమెను టార్గెట్ చేస్తే... ఈజీగా తాను ఫేమస్ అవ్వొచ్చన్న ఉద్దేశంతోనే వెంకటేశ్వర్లు ఇలా చేసి ఉంటాడన్న అనుమానాలున్నాయి. పోలీసులు ఈమధ్య సోషల్ మీడియాలో పోస్టులపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఎవరు ఎలాంటి వివాదాస్పద కామెంట్లు పెట్టినా వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. అందువల్ల వెంకటేశ్వర్లు కేసును కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇకపై కూడా ఎవరైనా ఇలాంటి కామెంట్లు పెడితే... ఎక్కడా రాజీ పడకుండా అరెస్టులు జరుగుతాయనీ, యూత్ ఆవేశాలకు పోకుండా... ఆలోచించాలనీ... ఇలాంటి పనులు చేసి... కెరీర్ దెబ్బతినకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు