• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • YOUTH HAD ALLEGEDLY DIED BY SUICIDE AT LOVER RESIDENCE AFTER HE WENT TO MEET HER SSR

ఈ 18 ఏళ్ల కుర్రాడు ఎలా చనిపోయాడో తెలిస్తే ‘అయ్యో పాపం’ అని అనకుండా ఉండలేరు..!

ఈ 18 ఏళ్ల కుర్రాడు ఎలా చనిపోయాడో తెలిస్తే ‘అయ్యో పాపం’ అని అనకుండా ఉండలేరు..!

సెల్వకుమార్ శ్రద్ధాంజలి బ్యానర్

ప్రియుడితో గొడవపడి అలిగిన ఆ యువతి వంటగదిలోకి వెళ్లి తలుపులేసుకుంది. సెల్వ కుమార్ ఎన్నిసార్లు తలుపు తట్టినా తీయలేదు. దీంతో.. తీవ్ర మనస్తాపం చెందిన సెల్వ కుమార్ క్షణికావేశంలో..

  • Share this:
    అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ యువకుడు ప్రేమించిన యువతితో గొడవపడి ఆమె ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సబర్మతిలోని కాళీగం ప్రాంతానికి చెందిన సెల్వ కుమార్(18) కుటుంబం తమిళనాడులోని కడలూరు నుంచి గుజరాత్‌కు వెళ్లి స్థిరపడింది. సెల్వ కుమార్ 10వ తరగతి వరకూ మాత్రమే చదువుకున్నాడు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సెల్వ కుమార్ అదే ప్రాంతానికి చెందిన ఓ 18 సంవత్సరాల యువతిని ప్రేమించాడు. ఇద్దరూ రెండేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇద్దరూ శారీరకంగా కూడా ఒకరికొకరు దగ్గరయ్యారు. కొన్ని రోజులుగా ఆ యువతి పెళ్లి చేసుకోవాలని సెల్వ కుమార్‌ను పలుమార్లు అడిగింది. అయితే.. ప్రతీసారీ ఏదో ఒక కారణం చెప్పి దాట వేస్తూ వచ్చాడు. గత బుధవారం సెల్వ కుమార్ ఆ యువతి ఇంటికి వెళ్లాడు. ఇద్దరూ కొద్దిసేపూ బాగానే మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కాస్తా గొడవకు దారితీసింది. ప్రియుడితో గొడవపడి అలిగిన ఆ యువతి వంటగదిలోకి వెళ్లి తలుపులేసుకుంది. సెల్వ కుమార్ ఎన్నిసార్లు తలుపు తట్టినా తీయలేదు. దీంతో.. తీవ్ర మనస్తాపం చెందిన సెల్వ కుమార్ క్షణికావేశంలో ఆమె ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ యువతి కొద్దిసేపటి తర్వాత సెల్వకుమార్ వెళ్లిపోయాడని భావించి తలుపు తీసింది. తలుపు తీసి చూసే సరికి నడి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. దీంతో.. ఆ యువతి భోరున విలపించింది. ప్రేమించిన వ్యక్తి తనకు దూరమవడంతో ఏడుస్తూ తన తండ్రికి జరిగిన విషయం చెప్పింది.

    బయటకు వెళ్లిన కొడుకు ఎంతసేపయినా తిరిగి రాకపోవడంతో సెల్వ కుమార్ తల్లిదండ్రులు అక్కడా ఇక్కడా అతని కోసం వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో అనుమానమొచ్చి సదరు యువతి ఇంటికి వెళ్లి చూడగా కొడుకు విగతజీవిగా కనిపించాడు. దీంతో.. ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. యువతిపై, ఆమె తండ్రిపై సెల్వకుమార్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి ఆ యువతి, ఆమె తండ్రే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నాడు. చేతికందొచ్చిన కొడుకు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు