YOUTH FOUND MURDERED INSIDE RENTED HOUSE IN TORANAGALLU AND WOMAN IS SUSPECT SSR
ప్రైవేట్ జాబ్ చేసే కుర్రాడు.. కొన్నేళ్లుగా ఆమెతో కలిసి అద్దె గదిలో ఎంజాయ్.. ఏమైందో కానీ..
ప్రతీకాత్మక చిత్రం
పశ్చిమ బెంగాల్ నుంచి కర్ణాటకకు ఉపాధి కోసం వచ్చాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనికి కుదిరాడు. ఓ అద్దె ఇల్లు తీసుకుని అందులోనే ఉండేవాడు. కానీ.. ఓ మహిళ పరిచయం ఆ యువకుడి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమెతో పెరిగిన పరిచయం చనువుగా మారి ఇద్దరూ కలిసి అదే అద్దె ఇంట్లో ఉండేంతలా...
బళ్లారి: పశ్చిమ బెంగాల్ నుంచి కర్ణాటకకు ఉపాధి కోసం వచ్చాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనికి కుదిరాడు. ఓ అద్దె ఇల్లు తీసుకుని అందులోనే ఉండేవాడు. కానీ.. ఓ మహిళ పరిచయం ఆ యువకుడి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమెతో పెరిగిన పరిచయం చనువుగా మారి ఇద్దరూ కలిసి అదే అద్దె ఇంట్లో ఉండేంతలా పరిస్థితి మారింది. కొన్నాళ్లు ఇద్దరూ అదే ఇంట్లో ఉంటూ, తింటూ బాగానే ఉన్నారు. కానీ.. ఏమైందో తెలియదు ఆ యువకుడు నాలుగు రోజుల క్రితం అదే ఇంట్లో శవమై కనిపించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బళ్లారి తాలూకా తోరణగల్లులోని బాబానగర్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అశిశ్(28) నివాసముంటున్నాడు. స్థానిక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ మహిళతో కలిసే గత కొన్నేళ్లుగా యువకుడు అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఏమైందో తెలియదు గానీ.. అశిశ్ నాలుగు రోజుల క్రితం శవమై కనిపించాడు. అప్పటి నుంచి ఆ మహిళ కూడా అదృశ్యమైంది. అశిశ్ చనిపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అశిశ్ అద్దెకు ఉంటున్న గదిలో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు గది తలుపులు తీసి చూడగా.. అశిశ్ శవం కనిపించింది. హత్య జరిగిన తీరును గమనించిన పోలీసులు.. నాలుగు రోజుల క్రితమే అశిశ్ హత్యకు గురైనట్లు చెప్పారు. గత కొన్నేళ్లుగా ఓ మహిళతో కలిసి యువకుడు ఉంటున్నాడని ఇంటి యజమాని పోలీసులకు చెప్పాడు. ఈ హత్య అతనితో కలిసి ఉంటున్న మహిళనే చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య ఘటనను పరిశీలిస్తే.. యువకుడిని ఆ మహిళతో పాటు మరికొందరు కలిసి హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
ఇంటి యజమాని ఫిర్యాదు ఆధారంగా తోరణగల్లు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అశిశ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోజూ అందరితో కలివిడిగా ఉండే అశిశ్ హత్యకు గురయ్యాడన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు పశ్చిమ బెంగాల్‌లోని అశిశ్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఎవరిపైన అయినా అనుమానం ఉందేమోనని ఆరా తీశారు. ఇంతకీ ఆ మహిళ ఎవరు.. అశిశ్తో ఆమెకు ఎలా పరిచయమైంది.. ఇద్దరూ కలిసి ఉండాలన్న ఆలోచన అశిశ్కు ఎందుకొచ్చింది.. ఆ మహిళ ఏం చేస్తుంటుందనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
కూతురితో కలిసి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరసన
మరిన్ని తాజా వీడియోల కోసం న్యూస్18 తెలుగు యూట్యూబ్ ఛానల్‌ను సబ్‌స్రైబ్ చేసుకోండి
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.