• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • YOUTH ENTERS GIRLS HOSTEL AND TRY TO RAPE GIRLS IN ONGOLE BS

ఒంగోలు బాలికల హాస్టల్‌లోకి అర్ధరాత్రి యువకులు.. ఏం చేశారంటే..

నమూనా చిత్రం

ఒంగోలులోని సెయింట్ జేవియర్స్ స్కూల్ హాస్టల్‌లో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. బాలికలు ఉంటున్న హాస్టల్‌లోకి ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు.

  • Share this:
    ఒంగోలులోని సెయింట్ జేవియర్స్ స్కూల్ హాస్టల్‌లో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. బాలికలు ఉంటున్న హాస్టల్‌లోకి ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. బాలికలపై లైంగిక దాడికి ప్రయత్నించారు. వెంటనే బాలికలు కేకలు వేయడంతో ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్‌లో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థినుల తల్లితండ్రులు తీవ్ర ఆందోళనకు గురై తమ పిల్లలను ఇంటికి తీసుకొని వెళ్లిపోయారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు.. హాస్టల్ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. విద్యార్థినులను, ఉపాధ్యాయులను విచారిస్తున్నారు. దుండుగులు హాస్టల్‌లోకి ఎలా ప్రవేశించారోనని ఆరా తీస్తున్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: