హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఆస్పత్రిలో తల్లిదండ్రులు.. హోం ఐసోలేషన్‌లో యువకుడు ఆత్మహత్య

ఆస్పత్రిలో తల్లిదండ్రులు.. హోం ఐసోలేషన్‌లో యువకుడు ఆత్మహత్య

తల్లిదండ్రులకు కరోనా రావడంతో ఐశ్వర్యరాజు హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నాడు. ఇంట్లో ఒక్కడే ఉండడం, కరోనా భయం నెలకొనడంతో.. తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడు.

  కరోనా అంత ప్రమాదమేమీ కాదు. మాస్క్ ధరిస్తూ..సామాజిక దూరం పాటిస్తే.. అది మన దరి చేరదు. ఒకవేళ వచ్చినా వైద్యులు సూచించిన మందులు వేసుకొని...రోగ నిరోధకశక్తి పెరిగే ఆహారాన్ని తీసుకుంటూ.. గుండె ధైర్యంతో ఉంటే కరోనాను ఎదుర్కోవచ్చు. ప్రభుత్వాలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. కానీ ఇప్పటికీ చాలా మందిలో అపోహలు ఉన్నాయి. కరోనా భయంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దారుణం జరిగింది. కరోనా భయంతో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

  ఏలూరులోని ఫిలాస్‌పేటకు చెందిన ఐశ్వర్యరాజు అనే యువకుడి తల్లిదండ్రులకు కరోనా సోకింది. వారిద్దరు ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లిదండ్రులకు కరోనా రావడంతో ఐశ్వర్యరాజు హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నాడు. ఇంట్లో ఒక్కడే ఉండడం, కరోనా భయం నెలకొనడంతో.. తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోనే ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఐశ్వర్యరాజు 2018లో నూజివీడు ఐఐఐటీలో CSE పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఐశ్వర్యరాజు ఆత్మహత్యతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

  ఏపీలో మంగళవారం సాయంత్రం వరకు 2,44,549 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాను జయించి వీరిలో 1,54,749 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం 87,597 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 2,203 మంది మరణించారు. ఇక కరోనా టెస్టుల విషయానికొస్తే.. మంగళవారం 58,315 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు 25,92,619 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

  First published:

  Tags: Eluru, West Godavari

  ఉత్తమ కథలు