HOME »NEWS »CRIME »youth drowned in krishna river at jurala project ba mbnr

జూరాల వద్ద కృష్ణా నదిలో పడి యువకుడు గల్లంతు

జూరాల వద్ద కృష్ణా నదిలో పడి యువకుడు గల్లంతు
ప్రతీకాత్మక చిత్రం

Jurala Project | జూరాల ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన యువకుడు నదిలో కొట్టుకుపోయాడు.

  • Share this:
    ఓ‌ యువకుడు నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయిన సంఘటన జూరాల ప్రాజెక్టు నందిమల్ల పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ కు చెందిన కృష్ణ ఇంటింటికి‌ వాటర్ క్యాన్ లు సప్లై చేస్తూ‌ జీవనం‌ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఆదివారం కావడంతో తన స్నేహితులతో‌ కలిసి‌ జూరాల ప్రాజెక్టుకు వచ్చాడు. సరదాగ నదిలో దిగి ఈతకొడుతుండగా ప్రమాదవశాత్తు నది వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. నదిలో కొట్టుకుపోతుండగా చూసిన వారు చాలా మంది కేకలు వేశారు. ఎవరూ కూడా కాపాడలేకపోయారు. కృష్ణ ఒడ్డుకు చేరుకున్నాడా లేక నదిలో‌‌ కొట్టుకుపోయాడా అనేది సమాచారం తెలియాల్సి ఉంది.

    కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న మనోహర దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు జూరాలకు భారీగా పోటెత్తారు. ప్రాజెక్టు ప్రధాన వంతెనపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. జూరాల డ్యాం 29 గేట్ల నుంచి నీటిని విడుదల‌ చేయడంతో నీటిని చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యాటక ప్రేమికులు జూరాలవైపు పరుగులు తీశారు. జూరాలకు వివిధ ప్రాంతాల‌ నుంచి కార్లలో అత్యధికంగా రావడం కనిపించింది. మొన్నటి వరకు శ్రావణమాసం. ఆ తర్వాత. శుక్రవారంతో ముగియడంతో... జూరాలకు వచ్చిన ప్రతి సందర్శకుడు జూరాల ఎడమ కాలువ వైపు బారులు తీరారు. చేప రుచి‌ చూడకుండా ఎవరూ అక్కడ నుంచి పక్కకు జరగలేదు.



    మరోవైపు నల్లగొండ జిల్లాలో సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణాలు తీసింది. మూసీ ప్రాజెక్టు గేట్ల కింద ఫోటోలు దిగడానికి వెళ్లి రాళ్ల మధ్యలో యువకుడు చిక్కుకొని మృతి చెందాడు. మృతుడు నకిరేకల్‌కు చెందిన చిట్యాల సాయి (28)గా పోలీసులు గుర్తించారు. సాయి మరణంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:August 23, 2020, 23:00 IST

    टॉप स्टोरीज