పెళ్లి ఇంట్లో విషాదం.. అక్క రిసెప్షన్.. తమ్ముడు మృతి

తన స్నేహితులతో కలిసి ఊరు శివారులో ఉన్న చెరువులో స్నానానికి వెళ్లిన రాజు ఈత రాకపోవడంతో చెరువులోమునిగి మృతిచెందాడు.

news18-telugu
Updated: December 8, 2019, 8:23 PM IST
పెళ్లి ఇంట్లో విషాదం.. అక్క రిసెప్షన్.. తమ్ముడు మృతి
ఓ పెళ్లికూతురు అత్తింటివారికి భారీ షాక్ ఇచ్చింది.
  • Share this:
పెళ్లి జరుగాల్సిన ఇంట్లో విషాదం జరిగింది. చెరువులో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళిన యువకుడు శవమైతేలాడు. అక్క రిసెప్షన్ రోజే తమ్ముడు మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన బాషబోయిన సమ్మయ్య –రమాదేవిలకు నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు రాజు ఖమ్మంలో పాలిటెక్నిక్ చేస్తున్నాడు. అయితే ఈనెల 6వ తేదీన రెండవ అక్కయ్య వివాహం ఉండడంతో స్వంత గ్రామానికి వచ్చిన రాజు అక్కయ్య వివాహ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. రెండవ రోజు తన స్నేహితులతో కలిసి ఊరు శివారులో ఉన్న చెరువులో స్నానానికి వెళ్లిన రాజు ఈత రాకపోవడంతో చెరువులోమునిగి మృతిచెందాడు. దింతో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. ఈ మేరకు కేసు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>