కరోనాతో తమ్ముడు మృతి.. తట్టుకోలేక ఆగిన అన్న గుండె

తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. 24 గంటల వ్యవధిలోనే అన్నాదమ్ముళ్లు మరణించడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

news18-telugu
Updated: August 14, 2020, 8:44 AM IST
కరోనాతో తమ్ముడు మృతి.. తట్టుకోలేక ఆగిన అన్న గుండె
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనాతో తమ్ముడు చనిపోయిన కొన్ని గంటల్లోనే అన్న కుప్పకూలాడు. తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. 24 గంటల వ్యవధిలోనే అన్నాదమ్ముళ్లు మరణించడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింత కుంట మండలంలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. పెద్ద వడ్డెమాన్ గ్రామానికి చెందిన నాగేశ్వర్ రెడ్డి (50) నారాయణపేట్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. మహబూబ్ నగర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించాడు.

గురువారం మధ్యాహ్నం నాగేశ్వర్ రెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు ఆస్పత్రి సిబ్బంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సొంతూరు పెద్ద వడ్డెమాన్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు పూర్తయ్యాక కుటుంబ సభ్యులంతా ఇంటికి చేరుకున్నారు. నాగేశ్వర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆయన అన్న సుదర్శన్ రెడ్డి ఆ రోజతా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ క్రమంలో గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గుండె నొప్పితో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. అన్నా దమ్ముళ్ల మృతిలో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: August 14, 2020, 8:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading