హోమ్ /వార్తలు /క్రైమ్ /

అమ్మాయిలా ప్రవర్తిస్తున్న అబ్బాయి.. తల్లిదండ్రులకు పెరిగిన అనుమానం.. బయటపడ్డ అసలు విషయం.. అదే కారణం

అమ్మాయిలా ప్రవర్తిస్తున్న అబ్బాయి.. తల్లిదండ్రులకు పెరిగిన అనుమానం.. బయటపడ్డ అసలు విషయం.. అదే కారణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చికిత్సలో అతను గత నెల రోజులుగా మందులు తీసుకుంటున్నాడు. దాని కారణంగా అతనిలో చాలా మార్పులు వచ్చాయి.

  ప్రేమించిన మహిళను దక్కించుకునేందుకు కొందరు ఏమైనా చేస్తుంటారు. ఈ క్రమంలో తాము అలాంటి నిర్ణయం తీసుకోవచ్చా ? లేదా ? అనే విషయాన్ని కూడా పట్టించుకోరు. అయితే తాము తీసుకున్న నిర్ణయం సరైంది కాదని తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోబోయే యువకుడు మాత్రం కాస్త ముందుగానే మేల్కోన్నాడు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ యువకుడు కూడా ఇదే రకమైన నిర్ణయం తీసుకున్నాడు. 32 ఏళ్ల యువకుడు ఢిల్లీలో ఉన్న ఒక బహుళజాతి కంపెనీలో పని చేస్తున్నాడు.

  యువకుడి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా బాగానే ఉంది. మంచి కుటుంబం నుంచి అతడు వచ్చాడు. అతని తండ్రి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ పొందాడు. ఆ యువకుడు తన కంపెనీలో పనిచేస్తున్న సహోద్యోగితో ప్రేమలో పడ్డాడు. ఆ మహిళ వితంతువు. ఆమె భర్త కరోనా కారణంగా రెండేళ్ల క్రితం మరణించాడు. యువకుడు యువతికి పెళ్లి ప్రపోజ్ చేయగా యువతి నిరాకరించింది. చనిపోయిన తన భర్త తనను చాలా ప్రేమించేవాడని.. అతడిని తప్ప తాను మరెవరినీ భర్తగా చూడలేనని చెప్పింది.

  అయితే ఎలాగైనా ఆ మహిళతో కలిసి జీవితం గడపాలని నిర్ణయించుకున్న ఆ యువకుడు.. తీవ్ర నిర్ణయం తీసుకోవాలని భావించాడు. ఆ మహిళతో కలిసి జీవించడానికి అమ్మాయిగా మారాలని నిర్ణయించుకున్నాడు. యువకుడు తన లింగాన్ని మార్చుకోవడానికి వైద్యుడిని సంప్రదించాడు. అతని సలహాపై హార్మోన్ చికిత్స ప్రారంభించాడు.

  పెళ్లి జరిగి 3 రోజులే.. మామయ్యకు ఆరోగ్యం బాగులేదంటూ వెళ్లిన వధువు.. ఆ తరువాత ఫోన్ కట్.. చివరకు ఎక్కడ దొరికిందంటే..

  వ్యాపారి ఇంట్లో దోపిడీ.. రూ. 45 లక్షలు చోరీ.. అంతా అయిపోయిందనుకున్న సమయంలో మరో షాక్..

  చికిత్సలో అతను గత నెల రోజులుగా మందులు తీసుకుంటున్నాడు, దాని కారణంగా అతనిలో చాలా మార్పులు వచ్చాయి. యువకుడు అమ్మాయిలా ప్రవర్తించడం ప్రారంభించడంతో అతని తల్లిదండ్రులకు అనుమానం వచ్చి కౌన్సెలర్‌ని తీసుకుని కౌన్సెలర్ సరిత రజని యువకుడికి కౌన్సెలింగ్ చేయించారు. ఈ క్రమంలో యువకుడు ప్రేమలో లింగాన్ని మార్చుకున్న విషయాన్ని వెల్లడించాడు. కౌన్సెలింగ్ తర్వాత ఆ యువకుడి లింగ మార్పు చికిత్స నిలిపేశారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Crime news, Love affair

  ఉత్తమ కథలు