Home /News /crime /

YOUTH COMMITS SUICIDE BY CONSUMING ACID AFTER HIS FATHER DENIED TO BUY NEW CAR INCIDENT IN KORUTLA IN JAGTIAL DISTRICT MKS

Telangana: కొత్త కారు కొనివ్వలేదని యాసిడ్‌ తాగాడు.. మంట తట్టుకోలేక అరుపులు.. చివరికి..

కోరుట్ల యువకుడు భానుప్రకాశ్ (పాత ఫొటో)

కోరుట్ల యువకుడు భానుప్రకాశ్ (పాత ఫొటో)

తల్లిదండ్రులు తనకు కొత్త కారు కొనివ్వలేదని మనస్తాపంతో ఓ యువకుడు యాసిడ్ తాగాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో జరిగిందీ ఘటన. గతంలోనూ ఓ సారి అతను సెల్ ఫోన్ కొనివ్వలేదని చేయి కోసుకున్నాడట..

కుటుంబ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా లేనిపోని దర్పాలు కోరుకుంటూ, తల్లిదండ్రులపై కోపంతో తనువు చాలిస్తోన్న యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సెల్ ఫోన్ కొనివ్వలేదనే మనస్తాపంతో పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతోన్న వార్తలు తరచూ వింటుంటాం. తాజా ఘటనలో ఓ యువకుడు.. కారు కొనివ్వలేదని ఏకంగా యాసిడ్ తాడేశాడు. జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటుచేసుకుందీ ఘటన. ఎస్సై సతీశ్, స్థానికులు చెప్పిన వివరాలివి..

తనకు కారు కొనివ్వడం లేదని సీపెల్లి భానుప్రకాశ్‌గౌడ్‌ (22) అనే యువకుడు యాసిడ్‌ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మం డలం కల్లూర్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. కల్లూ ర్‌ గ్రామానికి చెందిన సీపెల్లి అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు భానుప్రకాశ్‌గౌడ్‌ కొంతకాలంగా కారు కొనివ్వాలని కుటుంబసభ్యులను కోరుతూ వస్తున్నాడు.

Petrol Diesel Prices: భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ రేటు.. దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెంపు..


కొత్త కారు కొనాల్సిందేనంటూ భానుప్రకాశ్ గత 15 రోజులుగా తల్లిదండ్రులను మరింత పట్టుపడుతూ వచ్చాడు. అయితే అతని కోరికను ఇంట్లో ఎవరూ పట్టించుకోవడం లేదనే బాధలో ఆ యువకుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో గ్రామశివారులో యాసిడ్‌ తాగాడు. ఆ తర్వాత మంటకు తాళలేక అరుస్తూ రోడ్డుపైకి వచ్చి పరుగులు తీశాడు..

KCR దూకుడుకు అమిత్ షా కళ్లెం! -ఢిల్లీ నుంచే మిషన్ తెలంగాణ ఆపరేషన్ -రంగంలోకి ఆ 26 మంది?


యాసిడ్ తాగడంతో కడుపులో మంటతో భానుప్రకాశ్ రోడ్డుపై విలవిల్లాడుతుండగా స్థానికులు గుర్తించి అతణ్ని ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబీకులు అతణ్ని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స మొదలైన కాసేపటికే యువకుడు మృతి చెందాడు. ఇదివరకు కూడా సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని భానుప్రకాశ్‌ చేయి కోసుకున్నట్లు సమాచారం. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు.
Published by:Madhu Kota
First published:

Tags: Crime news, Jagityal, Suicide, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు