హోమ్ /వార్తలు /క్రైమ్ /

యువతితో లివింగ్ రిలేషన్ షిప్.. బీఫ్ తినాలంటూ టార్చర్.. యువకుడు ఏంచేశాడంటే..

యువతితో లివింగ్ రిలేషన్ షిప్.. బీఫ్ తినాలంటూ టార్చర్.. యువకుడు ఏంచేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gujarat: యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కానీ.. వీరి ప్రేమను యువకుడి ఇంట్లో అంగీకరించలేదు. దీంతో యువకుడు, యువతితో పెళ్లికాకుండానే కలసి ఒకేచోట ఉంటున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India

యువత ప్రేమ వివాహాలు చేసుకొవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేమలో కొన్నిరోజుల పాటు ఇద్దరు కలిసి జర్నీ చేస్తారు. దీంతో ఒకర్నిమరోకరు అర్ధం చేసుకొవడానికి తగినంత సమయం దొరుకుతుంది. ఈ క్రమమంలో ఇద్దరు పూర్తిగా తెలుసుకొవచ్చనే భావనతో ప్రేమ పెళ్లిళ్లవైపు మొగ్గుచూపిస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం ప్రేమలు కేవలం అవసరాల కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. అవసరాలు తీరిపోయాక.. దూరంపెట్టడం, అవాయిడ్ చేయడం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల దాడులు చేయడం, హత్యలు చేయడానికి సైతం వెనుకాడటం లేదు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు.. గుజరాత్‌లో (Gujarat) షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉడనా లొ పటేల్ నగర్ లో.. యూపీకి చెందిన రాహుల్ సింగ్, మరో అమ్మాయి సోనమ్ అలీతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమకు దారితీసింది. రాహుల్ సింగ్ తన ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో వారికి చెప్పాడు. కానీ దీనికి వారు అంగీకరంచలేదు. అప్పటి నుంచి అతను ఇంట్లో వారితో మాట్లాడటం మానేశాడు. కేవలం పెళ్లి చేసుకోకుండానే యువతితో ఒక దగ్గర ఉండేవాడు. వీరు సూరత్ లో ఉంటున్నాడు. అయితే.. రాహుల్ సింగ్ ను, యువతి తరచుగా వేధిస్తుండేది. ఒక రోజున బీఫ్ తినాలంటూ, రాహుల్ ను యువతి, అతని సోదరుడు వేధించారు. దీంతో వీరి టార్చర్ భరించలేకపోయాడు. తినకపోతే చంపేస్తామంటూ వేధించారు.వీరి వేధింపులు ఎక్కువ కావడంతో రాహుల్ సింగ్ తన జీవితంలో పెద్ద పొరపాటు చేశానని తెలుసుకుని,సూసైడ్ నోట్ రాశాడు. దాన్ని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. ఆ తర్వాత.. గదిలో వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు.దీంతో రాహుల్ గదిలో విగతీ జీవిగా చూసి.. యువతి అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. కాగా, ఈ ఘటన జూన్ 27 జరిగింది. ఆ తర్వాత.. మిస్టరీ సూసైడ్ గా పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ మధ్యన ఫేస్ బుక్ లో ఉన్న పోస్ట్ ను అతని ఇంట్లో వారు గమనించారు. దానిలో యువతి పెట్టిన వేధింపులను రాసుకొచ్చాడు. అయితే.. యువకుడి కుటుంబసభ్యులు యువతిపై, ఆమె సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ చేపట్టారు. అయితే.. వీరిద్దరికి పెళ్లి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం పరస్పరం అంగీకారంతో ఒకే ఇంట్లో సహాజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Gujarat, Suicide hanging

ఉత్తమ కథలు