ఆన్ లైన్ గేమ్స్ కోసం అప్పు... తల్లిదండ్రులు తీర్చడంతో మనస్తాపం చెందిన కొడుకు..

గేమ్ ఆడేందుకు చేసిన రూ.15 లక్షల అప్పును తల్లిదండ్రులు తీర్చడంతో మనస్తాపం చెంది బిటెక్ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

news18-telugu
Updated: July 11, 2020, 8:25 PM IST
ఆన్ లైన్ గేమ్స్ కోసం అప్పు... తల్లిదండ్రులు తీర్చడంతో మనస్తాపం చెందిన కొడుకు..
తోట మధుకర్ (File)
  • Share this:
ఆన్ లైన్ గేమ్ ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గేమ్ ఆడేందుకు చేసిన రూ.15 లక్షల అప్పును తల్లిదండ్రులు తీర్చడంతో మనస్తాపం చెంది బిటెక్ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లాలో విషాదం నింపింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల గ్రామానికి చెందిన తోట శంకర్ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. వీరిలో కుమారుడు మధుకర్ బీటెక్ చదువుతున్నాడు. అదే సమయంలో ఇతను ఆన్ లైన్ డఫ్పా‌గేమ్ కు అలవాటు పడ్డాడు. స్నేహితుల వద్ద అప్పులు చేసి మరీ ఆడటంతో పదిహేను లక్షల రూపాయల వరకు అప్పులయ్యాయి. తల్లిదండ్రులకు ఒక కుమారుడు కావడంతో మందలించి ఆ అప్పులు కట్టారు. దీంతో మధుకర్ తన తల్లిదండ్రులను అప్పులపాలు చేశానని మనస్తాపం చెంది గత మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగడంతో కరీంనగర్ అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ‌ఆ గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 11, 2020, 8:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading