తల తీసేసి..కాళ్లు చేతులు నరికేశారు...యువకుడి దారుణ హత్య

వంశీని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. తలం తీసేసి..కాళ్లు చేతులు నరికేసి అతి క్రూరంగా చంపేశారు. కానీ ఎవరు చంపారు? ఎందుకోసం హత్యచేశారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

news18-telugu
Updated: February 10, 2019, 6:13 PM IST
తల తీసేసి..కాళ్లు చేతులు నరికేశారు...యువకుడి దారుణ హత్య
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 10, 2019, 6:13 PM IST
కట్టెల కోసం అడవికి వెళ్లిన యువకుడు రాత్రైనా ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై ఊరంతా వెతికారు. కానీ ఎక్కడా కనబడలేదు. వెతికి వెతికి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతడి ఫోన్ వివరాలతో పాటు మిత్రులను కలిసి ఎంక్వైరీ చేశారు. కానీ ఫలితం లేదు. నాలుగు రోజులు గడుస్తున్నా అతడి ఆచూకీ తెలియలేదు. దాంతో ఈ కేసు సవాల్‌గా మారింది. పోలీసులను పలు బృందాలుగా విభజించి అతడి కోసం అన్వేషించారు.

చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం దిగువపూడి గ్రామంలో ఈ ఘటన జరిగింది. తప్పిపోయిన ఆ యువకుడు...గోవిందరాజులు, మునిచంద్రమ్మ దంపతుల రెండో కుమారుడు వంశీ..! సీన్ కట్ చేస్తే...శుక్రవారం ఆ ఊరు సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో భరించలేనంత దుర్వాసన వచ్చింది. స్థానికులు వెళ్లి చూడగా.. తల, కాలు, చెయ్యిలేని మొండెం కనిపించింది. తీవ్ర భయాందోళనకు గురైన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకొని వివరాలు ఆరాతీశారు. అప్పటికే వంశీ మిస్సింగ్ కేసు నమోదు కావడం..అదే ఊరిలో డెడ్‌బాడీ దొరకడంతో ఆ కోణంలో దర్యాప్తు చేశారు.

ఘటనాస్థలానికి కొంత దూరంలో సెల్‌ఫోన్, మొలతాడు దొరికాయి. వంశీ కుటుంబ సభ్యులకు చూపించిన తర్వాత...ఆ మృతదేహం అతనిదేనని నిర్ధారించారు పోలీసులు. కానీ తల మాత్రం దొరకలేదు. సుమారు ఐదు గంటల పాటు వెతికిన తర్వాత...ఓ క్లూ దొరికింది. మొండెం దొరికిన ప్రాంతానికి కొంత దూరంలో పూడ్చిపెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. గుంతను తవ్వి చూస్తే.. లుంగీలో కట్టివుంచిన తల బయటపడింది. డెడ్‌బాడీ కుళ్లిపోతున్న స్థితిలో కనిపించడంతో మూడు రోజుల క్రితమే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు.

వంశీని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. తలం తీసేసి..కాళ్లు చేతులు నరికేసి అతి క్రూరంగా చంపేశారు. కానీ ఎవరు చంపారు? ఎందుకోసం హత్యచేశారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐతే వంశీకి అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధమున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో హత్యకు ఆ సంబంధమే కారణమని అంచనాకు వచ్చారు. మృతుడి బంధువులు సైతం అదే ఆరోపణలు చేస్తున్నారు. హత్యకు అసలు కారణమేంటన్న దానిపై పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పుత్తూరు డీఎస్‌పీ సౌమ్యలత నేతృత్వంలో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.


First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...