రాళ్లతో కొట్టిచంపి.. చితి మంటల్లో తగులబెట్టారు.. ఏపీలో దారుణ హత్య

ప్రసాద్ కుటుంబ సభ్యులు కొందరు బారికిని పట్టుకొని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అతడిని రాళ్లతో కొట్టి చంపి.. అప్పటికే కాలుతున్న చితిపై వేసి తగులబెట్టారు.

news18-telugu
Updated: July 23, 2020, 7:15 AM IST
రాళ్లతో కొట్టిచంపి.. చితి మంటల్లో తగులబెట్టారు.. ఏపీలో దారుణ హత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చంద్రుడిపైకి రాకెట్లు పంపుతున్న హైటెక్ యుగంలోనూ మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో అంధవిశ్వాసాలతో అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా విజయనగరం జిల్లా గుమ్మ లక్ష్మీపురం ఏజెన్సీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. చిల్లంగి నెపంతో ఓ యువకుడిని రాళ్లతో కొట్టిచంపి.. అనంతరం చితి మంటల్లో వేసి తగులబెట్టారు. జూలై 11న జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే..

కొండకూనేరు గ్రామానికి చెందిన పల్లెరిక ప్రసాద్‌ (23) కాలికి గాయమై ఈ నెల 11న అనారోగ్యంతో చనిపోయాడు. ఐతే ప్రసాద్‌ మృతికి అదే గ్రామానికి చెందిన పల్లెరిక బారికి అలియాస్‌ మిన్నారావే కారణమని కుటుంబసభ్యులు అనుమానించారు. చిల్లింగి చేయడం వల్లే అనారోగ్యంతో ప్రసాద్ మరణించాడని కోపం పెంచుకున్నారు. అదేరోజు ప్రసాద్‌ అంత్యక్రియలు ముగిసిన తర్వాత అందరూ ఇళ్లకు చేరుకున్నారు. ఐతే ప్రసాద్ కుటుంబ సభ్యులు కొందరు బారికిని పట్టుకొని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అతడిని రాళ్లతో కొట్టి చంపి.. అప్పటికే కాలుతున్న చితిపై వేసి తగులబెట్టారు.

మృతుడు బారికి గ్రామంలో ఒంటిరిగా నివసించేవాడు. కొన్నేళ్ల క్రితమే భర్తతో విడిపోయి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అతడికి ఎవరూ లేకపోవడంతో ఈ ఘోరం ఇన్నాళ్లు బయటకు పొక్కలేదు. ఐతే డొంగరకెక్కువ గ్రామానికి చెందిన బారికి మేనల్లుడు వెంకటరమణ మామ కోసం కొండకూనేరు గ్రామానికి వచ్చాడు. అక్కడ అతడు లేకపోవడంతో స్థానికులను ఆరా తీశాడు. ఈ క్రమంలోనే వెంకటరమణకు అసలు నిజం తెలిసింది. బారికిని చంపేశామని, పెద్దల సమక్షంలో రాజీ చేసుకుందామని గ్రామస్తులు చెప్పారు. అందుకు ఒప్పుకోని వెంటకరమణ.. ఎల్విన్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటరమణ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి.. 17 మందిపై కేసు నమోదు చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: July 23, 2020, 7:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading