హోమ్ /వార్తలు /క్రైమ్ /

అయ్యయ్యో శుభమా అని శుభకార్యానికి వస్తే.. వీడెక్కడ దాపురించాడమ్మా నీకు.. ఎంత ఘోరం తప్పింది..

అయ్యయ్యో శుభమా అని శుభకార్యానికి వస్తే.. వీడెక్కడ దాపురించాడమ్మా నీకు.. ఎంత ఘోరం తప్పింది..

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

దాడి చేసిన యువకుడు,  గాయపడ్డ యువతి దూరపు బంధువులవుతారు.  గతంలో పెళ్లి ప్రస్తావన రావడంతో ఆ యువతి ఆ యువకుడి నడవడిక నచ్చకపోవడంతో  పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఆ యువతిపై ద్వేషాన్ని మనసులో పెంచుకొని ఈ  ఘాతుకానికి పాల్పడ్డాడని భావిస్తున్నారు.

ఇంకా చదవండి ...

(K.Lenin, News18, Adilabad)

ప్రేమించలేదని ఒకరు… పెళ్ళికి నిరాకరించిందని మరొకరు…. ఇలా  యువతులపై ద్వేషం పెంచుకొని ఆటవికంగా దాడులకు పాల్పడం పరిపాటైంది. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.. కొద్ది రోజుల క్రితమే ఇలాంటి ఘటననే మన  రాష్ట్రంలో చోటుచేసుకుంది..  ఆ సంఘటన గురించి అంతా మర్చిపోకముందే సరిగ్గా అటువంటి ఘటననే మరొకటి తాజాగా మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మొన్నటి ఘటనలో తనను ప్రేమించలేదనే అక్కసుతో ప్రేమోన్మాది ఇలా ఘాతుకానికి పాల్పడితే, ఇక్కడ రెండేళ్ళ క్రితం తమ కుటుంబ సభ్యులు తెచ్చిన పెళ్ళి ప్రతిపాదనను నిరాకరించిందని రగిలిపోయిన యువకుడు ఆ యువతిపై ద్వేషం పెంచుకొని  బంధువుల ఇంటికి వచ్చిన ఆ యువతిపై కల్లు గీత కార్మికులు కల్లు గీయడానికి ఉపయోగించే కత్తితో ఆ యువతిపై దాడి చేశాడు.

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటి పరిధిలోని విలేజ్ నస్పూర్ లో ఈ ఘటన జరిగింది. మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామానికి చెందిన యువతి(21) నస్పూర్ లోని తమ బంధువుల ఇంటికి శుభకార్యం నిమిత్తం వచ్చింది. కార్యక్రమం ముగిసిన అనంతరం ఇంటికి బయలుదేరే క్రమంలో ఆటో ఎక్కుతుండగా వెనుక నుంచి వచ్చిన నస్పూర్ గ్రామానికి చెందిన గడ్డం సాయికిరణ్ కల్లుగీత కత్తితో ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన యువతి తండ్రి, ఇతర బంధువులు ఆ యువకుడిని దూరంగా నెట్టివేశారు. దీంతో ఆ యువకుడి  చేతిలో ఉన్న కత్తి  తాకి యువతి మెడపై గాయం అయింది. అక్కడే ఉన్న బంధువులు గాయపడ్డ ఆ యువతిని చికిత్స కోసం హుటాహుటిన ఓ ఆటోలో మంచిర్యాల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. దాడి చేసిన యువకుడు,  గాయపడ్డ యువతి దూరపు బంధువులవుతారు.  గతంలో పెళ్లి ప్రస్తావన రావడంతో ఆ యువతి ఆ యువకుడి నడవడిక నచ్చకపోవడంతో  పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఆ యువతిపై ద్వేషాన్ని మనసులో పెంచుకొని ఈ  ఘాతుకానికి పాల్పడ్డాడని భావిస్తున్నారు. యువకుడి దాడిలో గాయపడ్డ యువతి  తండ్రి లచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Adilabad