హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime news : ప్రేమజంటలను ఫాలో అవుతాడు .. వాళ్ల పనిలో వాళ్లుంటే .. వాడి పని సైలెంట్‌గా పూర్తి చేసుకుంటాడు

Crime news : ప్రేమజంటలను ఫాలో అవుతాడు .. వాళ్ల పనిలో వాళ్లుంటే .. వాడి పని సైలెంట్‌గా పూర్తి చేసుకుంటాడు

ugly fellow

ugly fellow

Telangana: వాడో పోకిరోడు. ప్రేమజంటలు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలిపోతాడు. పర్యాటక ప్రదేశాలు చూడటానికి వచ్చే జంటలను మాత్రమే టార్గెట్‌గా పెట్టుకుంటాడు. యువతి, యువకులు కలిసి ఉన్న సమయంలో తన పని పూర్తి చేసుకుంటాడు.

పిచ్చి వేషాలు, వెకిలి చేష్టలు, వెదవ పనులు చేస్తే ఎవరు ఊరుకుంటారు. ఎవ్వరూ ఊరుకోరు ...అందుకే అతడ్ని ఊరోళ్లంతా కలిసి కుల్లబొడిచారు. సూర్యాపేట(Suryapeta)జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు వస్తున్న యువతి, యువకులు, ప్రేమజంటల(Couples)పై మూడో కన్నేసిన ఓ ఆకతాయికి తగిన గుణపాఠం చెప్పారు స్థానికులు. ఇంతకి అతడు ఏం చేస్తున్నాడో తెలిసుకున్న పోలీసు(Police)లు కూడ నాలుగు తగిలించి కేసు బుక్ చేశారు.

వెదవకు దేహశుద్ధి..

వయసులో ఉన్న కుర్రాళ్లు ఎక్కడైనా అమ్మాయిలతో లేదంటే ఫ్రెండ్స్‌తో సరదాగా గడపుతారు. అతని మాత్రం ప్రేమజంటలు ఎక్కడ ఎక్కువగా తిరుగుతారో అక్కడ వాలిపోతాడు. అంతటితో ఆగకుండా ప్రేమజంటలు క్లోజ్‌గా ఉన్న సమయం చూసి తన సెల్‌ఫోన్‌లో వీడియోలు, ఫోటోలు తీస్తుంటాడు. ఇలా ఒకరిద్దరు కాదు యాభై జంటలను వాళ్ల పర్సనల్ మూమెంట్స్‌కి సంబంధించిన వీడియోలు తీశాడు రామకృష్ణ అనే ప్రబుద్ధుడు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని ఉండ్రుగొండ గ్రామ శివార్లలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి గుడికి ...ఆ చుట్టు పక్కన ప్రదేశాల్ని చూడటానికి వచ్చే ప్రేమజంటలను రామకృష్ణ సీక్రెట్‌గా తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అందరిలో ఒకడిగా వచ్చి ..సీక్రెట్‌గా ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటంతో మిగిలిన పర్యాటకులు కూడా భయపడిపోయారు. తమ వీడియోలు కూడా ఏవైనా అభ్యంతరకరమైనవి షూట్ చేశాడా అని కాసేపు కంగారుపడ్డారు.

చితకబాదిన ప్రేమజంట..

గత కొద్దిరోజులుగా ఇదే విధంగా యువతి, యువకులకు తెలియకుండా వీడియోలు తీస్తున్న రామకృష్ణను గురువారం ఓ ప్రేమజంట పసిగట్టి పట్టుకుంది. అతని చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ తీసుకొని చూసి షాక్ అయ్యారు. రామకృష్ణ ఫోన్‌లో సుమారు 40జంటల వీడియోలు ఉండటంతో స్థానికులకు చెప్పి చితకబాదారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు రామకృష్ణ ఆత్మకూర్ మండలం ఏపూర్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. ఫోన్‌లో ఉన్న వీడియోలేనా గతంలో ఇంకా ఎవైనా చిత్రీకరించాడా లేక తన ఫోన్‌లో ఉన్న వీడియోలు ఎవరెవరికి పంపాడు, ఏ గ్రూప్‌లో షేర్ చేశాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు.

Crime News : పోలీసుల్ని చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు .. వెంటబడి పట్టుకుంటే తెలిసింది అతనెవరో



పర్యాటక ప్రదేశంలో పాడు పని..

పట్టుబడిన రామకృష్ణ మానసిక స్థితిని పోలీసులు పరిశీలించారు. ఎందుకిలా చేస్తున్నాడు. డబ్బుల కోసం ప్రేమజంటల్ని బ్లాక్ మెయిల్ చేయడానికా లేక సైకో లక్షణాల కారణంగా ఈవిధంగా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకుంటున్నారు. అతను మాట్లాడే విధానం, నడవడిక చూస్తుంటే బాగానే ఉన్నాడని పోలీసులు తెలిపారు.

First published:

Tags: Suryapeta, Telangana crime news

ఉత్తమ కథలు