హోమ్ /వార్తలు /క్రైమ్ /

స్కానింగ్ సెంటర్‌లో సీక్రెట్ కెమెరా.. అమ్మాయిలే టార్గెట్.. యువకుడి అరెస్ట్

స్కానింగ్ సెంటర్‌లో సీక్రెట్ కెమెరా.. అమ్మాయిలే టార్గెట్.. యువకుడి అరెస్ట్

నిందితుడు అంజిత్

నిందితుడు అంజిత్

బయటకు అదో స్కానింగ్ సెంటర్. రోజూ చాలా మంది స్కానింగ్ చేయించుకునేందుకు వెళ్తుంటారు. వారిలో మహిళలు కూడా ఉంటారు. అలాంటి చోట ఓ షాకింగ్ విషయం బయటపడింది. సీక్రెట్ కెమెరా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కేరళ.. తిరువనంతపురంలో.. ప్రభుత్వ ఆరోగ్య శాఖతో.. టైఅప్ చేసుకుంది దేవీ స్టేజింగ్ సెంటర్. ఇదో స్కానింగ్ సెంటర్. రోజూ చాలా మంది రోగులు స్కానింగ్ చేయించుకుంటూ ఉంటారు. బిజినెస్ బాగా పెరగడంతో... 2 నెలల కిందట.. మరో చోట అదూర్ స్కానింగ్ సెంటర్ ప్రారంభించింది. అక్కడ కూడా చాలా మంది వచ్చి రోజూ MRI స్కానింగ్ చేయించుకుంటున్నారు. తాజాగా ఓ యువతి.. అదూర్ స్కానింగ్ సెంటర్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. తనను అసభ్యకరంగా సీక్రెట్ వీడియో తీశారని ఆరోపించింది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు... సైలెంట్‌గా వెళ్లి.. అదూర్ స్కానింగ్ సెంటర్‌పై దాడి చేశారు. అందులోని సిబ్బందిని ఎక్కడి వారు అక్కడే ఉండాలని చెప్పి.. తనిఖీలు చేశారు. స్కానింగ్ రూంలోని ఓ షెల్ఫ్‌లో బట్టల మధ్యలో ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అది ఎవరిది అని అడిగితే... అక్కడ పనిచేస్తున్న.. కతకల్‌కి చెందిన అంజిత్ తనదే అని చెప్పాడు. చార్జింగ్ చేసుకోవడం కోసం అక్కడ పెట్టినట్లు చెప్పా‌డు. అతనికి నాలుగు తగిలించిన పోలీసులు.. స్టేషన్‌కి తీసుకెళ్లారు.

ప్లాన్ ప్రకారం:

అంజిత్‌కి మొబైల్‌లో వీడియో క్లిప్పింగ్స్ చూసే అలవాటు ఉంది. ఎవరెవరో అలాంటి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నప్పుడు తానెందుకు చెయ్యకూడదు అనుకున్నాడు. అందుకోసం ఓ ప్లాన్ వేశాడు. స్కానింగ్ సెంటర్‌కి రోజూ మహిళలు, యువతులు వస్తుంటారు కాబట్టి.. వారిని సీక్రెట్‌గా వీడియోలు తియ్యాలి అనుకున్నాడు. అ కుట్ర ప్రకారమే.. స్కానింగ్ రూంలో కొన్ని బట్టలు ఏర్పాటు చేసి.. వాటి మధ్యలో మొబైల్ ఉంచి.. సీక్రెట్‌గా వీడియో రికార్డ్ చేస్తున్నాడు.

Memes : దుమ్మురేపే నవ్వుల మీమ్స్.. వెంటాడే ట్రోల్స్..

ఈ విషయాన్ని కనిపెట్టిన ఓ యువతి.. MRI స్కానింగ్ చేయించుకుంటూ.. అక్కడ మొబైల్ ఎందుకు ఉంది అని ప్రశ్నిస్తే.. చార్జింగ్ కోసం ఉంచినట్లు చెప్పాడు. కానీ ఆ యువతి నమ్మలేదు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఆమె అనుమానమే నిజమైందని తెలిసింది. అతని మొబైల్‌లో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో త్వరలోనే తెలుస్తుందనీ.. ఫోన్‌ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించామని పోలీసులు తెలిపారు,

ఈ అంజిత్.. ఇదివరకు దేవి స్కానింగ్ సెంటర్‌లో పనిచేసేవాడు. అక్కడ కూడా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడనే ఆరోపణలున్నాయి. అతన్ని అదూర్ సెంటర్‌కి పంపించారు. అక్కడ కూడా అతని తీరు మారలేదని అర్థమవుతోంది. స్కానింగ్ సెంటర్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Rasi Phalalu : ఈ రాశుల వారికి విజయాలు .. కొందరికి ఆరోగ్య అలర్ట్

వెధవలు ఎక్కడున్నా వెధవల్లాగే ఉంటారు. అలాంటి వాళ్లతో అప్రమత్తంగా ఉండాలి. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ సీక్రెట్ కెమెరాలు ఉన్నాయేమో చూసుకోవాలి. షర్ట్ బటన్‌లో పట్టేంత చిన్న సీక్రెట్ కెమెరాలు కూడా ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. అందువల్ల అలర్ట్‌గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

First published:

Tags: Crime news, Kerala

ఉత్తమ కథలు