హైదరాబాద్‌లో దారుణం.. యువతి స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌తో షూట్..

దిశ హత్యాచార ఘటన తర్వాత మహిళా భద్రతపై సర్వత్రా చర్చ జరుగుతున్నా... మహిళలపై అఘాయిత్యాలకు మాత్రం తెరపడటం లేదు. తాజాగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో మరో దారుణం వెలుగుచూసింది.

news18-telugu
Updated: December 4, 2019, 10:40 AM IST
హైదరాబాద్‌లో దారుణం.. యువతి స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌తో షూట్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దిశ హత్యాచార ఘటన తర్వాత మహిళా భద్రతపై సర్వత్రా చర్చ జరుగుతున్నా... మహిళలపై అఘాయిత్యాలకు మాత్రం తెరపడటం లేదు. తాజాగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో మరో దారుణం వెలుగుచూసింది. ఇంట్లో స్నానం చేస్తుండగా ఓ యువతిని.. పక్కింటి యువకుడు రహస్యంగా వీడియో తీశాడు.అతని సెల్‌ఫోన్‌ని గమనించిన యువతి వెంటనే అప్రమత్తమై బాత్రూమ్ నుంచి పరిగెత్తింది. ఆపై 100కి డయల్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు నిమిషాల్లో అక్కడికి చేరుకుని బాధితురాలి ఫిర్యాదు మేరకు
నిందితుడు ఫరూక్‌ని అరెస్ట్ చేశారు. అతని సెల్‌ఫోన్‌లో అసభ్య ఫోటోలు,వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. గతంలోనూ ఫరూక్ అమ్మాయిల వీడియోలు తీస్తూ దొరికినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...