Home /News /crime /

YOUNGSTERS FIRING GUNS AT BIRTHDAY PARTY IN MADHYA PRADESH VIDEO VIRAL SNR

Madhya Pradesh:ఫ్రెండ్ పుట్టిన రోజున గాల్లో కాల్పులు ..సెలబ్రేషన్స్‌ ఇలా కూడా చేస్తారా

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Video Viral: మధ్యప్రదేశ్‌లో ఓ రౌడీముూకల బ్యాచ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్న వీడియో కలకలం రేపుతోంది. సుమారు అరడజను మంది యువకులు కేక్ కట్ చేసిన తర్వాత పిస్టోల్స్‌ని గాల్లో చూపుతూ కాల్పులు జరపడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈవీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
మధ్యప్రదేశ్‌లో ఓ కుర్రాళ్ల బ్యాచ్ అంతా కలిసి పుట్టిన రోజు వేడుకలు(Birthday party) జరుపుకున్న తీరు ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఏదో ఫోజులు కొట్టాలని చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. స్నేహితుడు కేక్ కట్ చేయగానే పక్కనే ఉన్న మరో యువకుడు గాల్లో తుపాకులు పేల్చుతుండగా అక్కడున్న మరికొందరు స్నేహితులు వీడియో తీశారు. అయితే ఈ వీడియో ఎలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయిందో తెలియదు. విస్తృతంగా వైరల్ అవడంతో పోలీసులు పోకిరీ బ్యాచ్‌పై కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)రేవా (Rewa)జిల్లాలోని బైంకుత్‌పూర్(Bynkutpur)పోలీస్‌స్టేషన్‌ (Police Station)లిమిట్స్‌లో ఈఘటన జరిగింది. సోషల్ మీడియా(Social media)లో సర్క్యూలేట్ అవుతున్న వీడియో పోలీసు(Police)లకు చేరడంతో కేసు నమోదు చేసుకున్నారు. విచారణ జరుపుతున్నారు. అయితే బర్త్‌డే సందర్భంగా పిస్టోల్స్ చేతుల్లో పట్టుకొని గాల్లో కాల్పులు జరిపింది అల్లరి మూకలు కాదని పోలీసులు తేల్చారు. ఈ వీడియో ఉన్న వాళ్లందరూ గతంలో పలు నేరాలపై కేసుల్లో ఉన్నావాళ్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులంటే తమకు భయం లేదని విషయాన్ని చెప్పడానికే ఈవిధంగా బర్త్‌డే వేడుకలు నిర్వహించి..ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని రేవా ఎస్‌ఐ నవనీత్‌ బాసిన్‌ (Navneet Basin)తెలిపారు. స్థానికులకు తామంటే భయం ఉండేలా చేయాలన్న ఆలోచనతో రౌడీ మూకలు ఈ విధంగా గాల్లో కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.

పుట్టిన రోజు వేడుకల పేరుతో అరాచకం..
మధ్యప్రదేశ్‌లో ఈ తరహా ఘఠనలు జరగడం ఇదేం కొత్తకాదు. గతంలో కూడా పలుమార్లు ఈ విధంగా పుట్టిన రోజు వేడుకల పేరుతో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా..ఆ వీడియోలను సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసిన సందర్భాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అితే బైంకుత్‌పూర్‌లో జరిగిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని..నిందితుల్ని గుర్తించారు. అతి త్వరలోనే వారిని పట్టుకొని వాళ్ల దగ్గరున్న పిస్టోల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీస్తామని పోలీసులు తెలిపారు.
పిస్టోల్స్‌తో గాల్లో కాల్పులు..

సమాజంలో శాంతి,భద్రతలకు విఘాతం కలిగించి, స్థానిక ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న ఇలాంటి ఆకతాయిలు, పోకిరీ బ్యాచ్‌లకు చెందిన నేరగాళ్లను వదలవద్దని గ్రామస్తులు కోరుతున్నారు. గాల్లో కాల్చిన తుపాకీ తూటాల్లో బుల్లెట్స్ ఎవరికైనా తగిలితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే పోలీసులు కఠినంగా శిక్షిస్తారనే భయం కలిగేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. కేసు నమోదు చేసుకున్నప్పటికి వీడియో మాత్రం వైరల్ అవుతూనే ఉంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Madhya pradesh, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు