ప్రేమ యవ్వారం.. ఊళ్లో పంచాయితీ.. రెండోసారి కూడా ప్రేయసితో సహా ఎస్కేప్ అయిన కుర్రాడు.. చివరకు జరిగిందో ఘోరం..!

ప్రతీకాత్మక చిత్రం

ఓ కుర్రాడు తన ప్రేయసితో సహా ఎస్కేప్ అయ్యాడు. ఎలాగోలా అష్టకష్టాలు పడి వాళ్లను పట్టుకుని ఊరికి తీసుకొచ్చి పంచాయితీ చేసి ఎవరి ఇళ్లకు వాళ్లను పంపించారు. మరోసారి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో..

 • Share this:
  ఓ కుర్రాడి ప్రేమ యవ్వారం అతడి తండ్రి చావుకొచ్చింది. ఒకే ఊరికి చెందిన ఓ యువతి, ఓ యువకుడు ప్రేమించుకున్నారు. పరస్పరం బంధువులే కావడంతో తమ పెళ్లికి అడ్డు ఉండదనుకున్నారు. కానీ యువతి తల్లిదండ్రులు ఆ కుర్రాడితో పెళ్లికి అడ్డంగా నో చెప్పేశారు. దీంతో ఆ యువకుడు తన ప్రేయసితో కలిసి ఇంటి నుంచి పారిపోయాడు. ఎలాగోలా అష్టకష్టాలు పడి వాళ్లను పట్టుకుని ఊరికి తీసుకొచ్చి పంచాయితీ చేసి ఎవరి ఇళ్లకు వాళ్లను పంపించారు. కానీ వాళ్లిద్దరు మాత్రం అలా ఎవరిళ్లల్లో వాళ్లు ఉండలేకపోయారు. మరోసారి ఇంటి నుంచి పారిపోయారు. రెండోసారి కూడా ఇళ్లలోంచి వెళ్లిపోవడమే ఆ యువకుడి తండ్రి చావుకొచ్చింది. ఊహించని రీతిలో జరిగిన గొడవలో ఆయన హత్యకు గురయ్యాడు. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా ఎడపాడి సమీపంలో కొంగనాపురం పుదుపాళయం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో తంగవేల్ అనే 55 ఏళ్ల వ్యక్తికి 32 ఏళ్ల పెరియన్నన్, 24 ఏళ్ల ప్రకాష్ అనే కుమారులు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన సమీప బంధువు సెల్వంకు సంధ్య అనే ఓ కుమార్తె ఉంది. తంగవేల్ చిన్న కుమారుడు ప్రకాష్ కు, సంధ్యకు మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ కలిసి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ విషయం ఇళ్లల్లో తెలియడంతో గొడవలు జరిగాయి. దీంతో తమ పెళ్లి జరగదేమోనని భయపడి ఇద్దరూ ఇళ్లల్లోంచి ఎస్కేప్ అయ్యారు. మార్చి 24వ తారీఖున ఓ గుడిలో ప్రేమ పెళ్లి చేసుున్నారు. ఆ తర్వాత రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిపించి వారి గ్రామంలో పంచాయితీ పెట్టించారు. మొత్తానికి ఆ ప్రేమ జంట ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయేలా పంచాయితీలో తీర్పునిచ్చారు.

  అయితే మార్చి 29వ తారీఖున కూడా ఆ ప్రేమ జంట మరోసారి ఇళ్లల్లోంచి పారిపోయారు. దీంతో ఆ యువతి తండ్రి సెల్వం, అతడి పెద్ద కుమారుడు కలిసి తంగవేల్ ఇంటికి వచ్చారు. తమ కుమార్తెను తమకు అప్పగించాలని గొడవ పడ్డారు. ఈ గొడవలో తంగవేల్ ను, అతడి పెద్ద కుమారుడు పెరియన్నన్ ను కత్తితో సెల్వం పొడిచి పారిపోయాడు. స్థానికులు వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే తంగవేల్ మరణించగా, పెరియన్నన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సెల్వం కోసం పోలీసులు వెతుకుతున్నారు.
  Published by:Hasaan Kandula
  First published: